కేజీయఫ్ అనే ఒక్క సినిమా రాకముందు అసలు కన్నడ హీరో యశ్ అనే వ్యక్తి ఎవరో కూడా తెలియదు. ఈ ఒకే ఒక్క సినిమా యశ్‌ను రాకింగ్ స్టార్‌ను చేసేయడంతో పాటు తిరుగులేని పాన్ ఇండియా హీరోను చేసేసింది. యశ్ ఇప్పుడు బాలీవుడ్ బడా హీరోలకు పోటీ హీరో అయిపోయాడు. ఇంత పెద్ద హిట్ వచ్చిన వెంటనే వరుసగా యశ్‌కు పాన్ ఇండియా రేంజ్ సినిమా ఆఫర్లే వస్తున్నాయి. అసలు ఈ స్టార్ రేంజ్ వచ్చినందుకు మరో హీరో అయితే ఎలాంటి యాట్యిట్యూడ్ చూపిస్తాడో ? చెప్పక్కర్లేదు.
కానీ యశ్ మాత్రం చాల డౌన్ టు ఎర్త్ ఉంటున్నాడు. రీసెంట్గా ముంబైలో ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పిన ఆన్సర్లతో ఇండియన్ సినిమా జనాలకు దిమ్మతిరిగినంత పనైంది. తాను కన్నడ ఇండస్ట్రీకి చెందిన వాడిని అని.. తాను తన ఇండస్ట్రీ గురించే ఆలోచిస్తానని.. మన సంస్కృతుల్లో ఉన్న వైవిధ్యమే మన బలం అని.. అంతకుమించి శాండల్‌వుడ్ బాగుపడింది.. బాలీవుడ్ బాగుపడింది అన్నది అబ్సర్ట్.. అసలు ఈ వుడ్లు అన్నీ కావు.. ఓన్లీ ఇండియన్ సినిమా అన్నాడు.
యశ్ మాటలు అతడి మెచ్యురిటీకి ఎంత నిదర్శనమో చెప్పక్కర్లేదు. రాజ్‌దీప్ సర్దేశాయ్ యశ్‌ను ఎంత ఇబ్బంది పెట్టేందుకు ట్రై చేసినా యశ్ ఏ మాత్రం బ్యాలెన్స్ తప్పలేదు. చాలా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ వచ్చాడు. చివరకు కర్నాటకలోని బెల్గాం ఇష్యూను కెలుకుతూ బెల్గాంను మహారాష్ట్ర వాళ్లు తమదే అంటున్నారన్న ప్రశ్నకు ఆన్సర్ చేస్తూ ఒక్క బెల్గాం ఏంటి ? వీలైతే ప్రత్యేక దేశమే అడుగుతారు ? మీరు అంటూ రాజ్‌దీప్‌కు చురకలు అంటించారు.
కాంతారా నువ్వులేకపోయినా ఇరగదీస్తుందిగా అని రాజ్‌దీప్ మళ్లీ కెలికాడు. అది నా సినిమాయే. కన్నడలో ఏ సినిమా అయినా తాను ఎంజాయ్ చేస్తానని.. అయినా అది మా హోంబలే వాళ్ల సినిమాయే అని గర్వంగా చెప్పుకున్నాడు. రిషిబ్ కూడా మావాడే… అతడి సినిమా నాది కాకుండా ఎలా పోతుందని చెప్పాడు.
అసలీ విజయాలు మా బుర్రలకు ఎక్కవు.. మేం దారి తప్పేలా చేయవు. మా డాడీ ఇప్పటకీ బస్ నడిపిస్తాడు.. నా కొడుకు సక్సెస్ నా సక్సెస్ ఎలా ? అవుతుందని ప్రశ్నిస్తాడు. తాము డౌన్ టు ఎర్త్ ఉంటామని.. మబ్బుల్లో ఎగరం అని చెపుతున్నాడు. నిజంగా యశ్ చెప్పిన జవాబులతో రాజ్‌దీప్ సర్దేశాయ్ మతులు పోయాయి. యశ్ లాంటి అందరు స్టార్ హీరోలు ఉండాలని ఆశిద్దాం..!