Newsకాంగ్రెస్ కి చెలగాటం..తెరాస కి ప్రాణసంకటం

కాంగ్రెస్ కి చెలగాటం..తెరాస కి ప్రాణసంకటం

ఇప్పుడు పొలిటికల్ డిస్కషన్స్ మొత్తం తెలంగాణా టైగర్ రేవంత్ రెడ్డి చూట్టు తిరుగుతుంది . మొన్న ఢిల్లీ లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి కలిసిన వార్త సర్వత్రా చర్చకు దారి తీసింది , దానికి ఆద్యం పోస్తూ కాంగ్రెస్ యువ నాయకుడు, సబితా ఇంద్ర రెడ్డి కుమారుడు కార్తిక్ రెడ్డి దగ్గరనుండి కురువృద్దులు V హనుమంత రావు వరకు ఒకరిద్దరు మినహా అందరు రేవంత్ రాకను స్వాగతించారు . అయితే రేవంత్ ఇంకా డెసిషన్ తీసుకోలేదని సమాచారం.

నిజానికి తెలంగాణ రాజకీయాలు ఇప్పటివరకు అంత ఆసక్తికరంగా లేవనే చెప్పాలి . దానికి కారణం తెరాస ఏక ఛత్రాధిపత్యం. ప్రతిపక్ష నాయకులు మొదలుకొని మీడియా వరకు అంతా కెసిఆర్ కు వంత పాడే వారే తప్ప , దీటుగ ఎదుర్కొనే వారు కరువయ్యారు తెలంగాణాలో . ఉన్న ఒక్క రేవంత్ రెడ్డి గొంతు అసెంబ్లీ స్పీకర్ సభ్యుల మైక్ కట్ చేసినట్టు కత్తిరించింది అధికార పక్షం . ఇక టీడీపీ పరిస్థితైతే మరీ ఘోరం అంచలంచలుగా పార్టీ కాళీ అయ్యే దిశగా దూసుకుపోతుంది . వైసీపీ పూర్తిగా కనుమరుగైన సంగతి తెలిసిందే . ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం కాంగ్రెస్ మాత్రమే తెరాస కు ప్రత్యామ్న్యాయం గా కనిపిస్తుంది .కానీ తెలంగాణా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనే అని విస్తృతంగా ప్రచారం చెయ్యగల నాయకుడే లేడని చెప్పడంలో సందేహములేదు. టీ కాంగ్రెస్ నాయకుల్లో మంచి వక్తలు లేని లోటు అధినాయకత్వాన్ని తీవ్రంగా వేదిస్తుంది . ఇలాంటి సమయం లో రేవంత్ హస్తం చెంతకు చేరితే అది ఖచ్చితంగా కాంగ్రెస్ కి చెలగాటం..తెరాస కి ప్రాణసంకటం అవుతుందన్న వాదన వినిపిస్తోంది. ఈ మూవ్ ఇటు రేవంత్ కు అటు కాంగ్రెస్ కు ఇద్దరికి ప్లస్ అయ్యే అవకాశమే ఉందని వారి అభిప్రాయం . సగటు కార్యకర్త అభిప్రాయం కూడా అదే . ఏనాటికైనా రేవంత్ ను CM గా చూడాలనుకునే వారి సంఖ్యా తెలంగాణాలో ఎక్కువ గానే వుంది . అది టీడీపీ లో ఉండగా సాధ్యం అయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు కాబట్టి కాంగ్రెస్, రేవంత్ ల కలయిక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కి రేవంత్ రాజకీయ భవిష్యత్తుకి మంచి అవకాశం గా భావిస్తున్నారు విశ్లేషకులు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news