మన జీవితం ఏ క్షణాన ఎటువంటి మలుపు తీసుకుంటుందో ఎవ్వరూ ఊహించలేము.. మరీ సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత క్షణాల్లో జీవితాలు మారిపోతున్నాయి అంటే అతిశయోక్తి కాదేమో. మీరు ఫొటోలో చూస్తున్న అమ్మాయి నిన్నటివరకు నేపాల్ లో చిత్వాన్ బ్రిడ్జ్, గోర్ఖా వద్ద చేపలు పట్టే ప్రదేశంలో కూరగాయలు అమ్ముతుంటుంది. కానీ ఈరోజు రూపచంద్ర మహాజన్ అనే వ్యక్తి తీసిన ఒక్క ఫోటో వలన ఇప్పుడు ఓ పాపులర్ పర్సన్‌గా మారిపోయింది. ఈ నాటి హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని ఈ అమ్మడి చిత్రాలు తర్కారివాలీ హ్యాష్ ట్యాగ్‌తో షేర్ అవుతున్నాయి.
తన విశాలమైన చెంపలపై ముంగురులు వేలాడుతుండగా, కూరగాయల బండికి పక్కన నిలబడి ఫోన్లో మాట్లాడుతున్న ఆమె ఫొటోను మరియు తన వీపు మీద టమాట కేసులు తగిలించుకొని ముసిముసిగా ఆమె నవ్వుకుంటూ వస్తున్న ఫొటోలు చూస్తే ఎటువంటి హృదయాన్నైనా.. ఒక్క క్షణం తన వంకే చూపులు నిలుపుకునే అందం ఆమెది అంటే నిజమే అనకమానరు సుమీ!!