నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్‌ఫామ్‌లో ఉన్నాడు. ఇటు అఖండ సూపర్ హిట్ అయ్యింది. అఖండ సినిమా కలెక్షన్లు బాలయ్య కెరీర్‌లోనే టాప్. ఏపీలో టిక్కెట్ రేట్లు చాలా తక్కువ ఉన్న టైంలో అఖండ రిలీజ్ అయ్యింది. అదే టిక్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నప్పుడే అఖండ వచ్చి ఉంటే సినిమా వసూళ్లు దుమ్ము రేపేసేవి. ఇటు అన్‌స్టాపబుల్ సీజన్ 1 సూపర్ హిట్. సీజన్ కూడా ఇప్పటికే వచ్చిన ఎపిసోడ్లు బ్లాక్‌బస్టర్ కొట్టేశాయి.
ఇక అఖండ అంత పెద్ద హిట్ అయినా కూడా బాలయ్య కేవలం రు. 8 కోట్లు మాత్రమే తీసుకున్నాడట. అదే అంత పెద్ద హిట్ అంత పెద్ద హీరోకు వచ్చినందుకు గాను మరో హీరో ఎవరైనా ఆ ప్లేస్‌లో ఉంటే ఈ పాటికే రెమ్యునరేషన్ రు. 20 కోట్లకు పెంచేసేవారు. కానీ బాలయ్య ఇప్పుడు మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తోన్న వీరసింహారెడ్డి సినిమాకు గాను కేవలం రు. 10 కోట్లు మాత్రమే తీసుకుంటున్నాడట.
అఖండతో మార్కెట్ భారీగా పెరగడంతో పాటు బాలయ్య క్రేజ్ పెరగడం, అటు నైజాంతో పాటు ఓవర్సీస్‌లోనూ బాలయ్య సినిమాకు మంచి వసూళ్లు వస్తుండడం, ఈ తరం అభిమానులకు బాలయ్య కనెక్ట్ కావడంతో మార్కెట్, ప్రి రిలీజ్ బిజినెస్ భారీగా పెరిగింది. అయినా బాలయ్య మాత్రం రెమ్యునరేషన్ పెంచలేదు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటిస్తోన్న సినిమాకు కూడా కేవలం రు. 12 కోట్లే పుచ్చుకుంటున్నాడట.
ఇక బాలయ్యతో ఎప్పుడు కంపేరిజన్ వచ్చే సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి తీసుకుంటోన్న రెమ్యునరేషన్‌తో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ. చిరంజీవి ఒక్కో సినిమాకు కాస్త అటూ ఇటూగా రు. 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని భోగట్టా..! అయితే చిరు ఖైదీ నెంబర్ 150, సైరా సినిమాలకు రు.100 కోట్ల వసూళ్లు వచ్చాయి. అయితే చిరు తీసుకుంటోన్న రెమ్యునరేషన్‌కు, వచ్చిన వసూళ్లతో పోల్చి చూస్తే చాలా చాలా ఎక్కువ తీసుకుంటున్నట్టే..!
అంతెందుకు సైరా, ఆచార్య, తాజాగా గాడ్ ఫాదర్ ఈ మూడు సినిమాలు కూడా భారీ నష్టాలే మిగిల్చాయి. అయితే బాలయ్య కంటే చిరు ఎంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నా చిరు సినిమాలకు లాభాలు కనపడడం లేదు. ఇటు బాలయ్య తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోన్న నేపథ్యంలో నిర్మాతలు, సినిమా కొన్న వారు ఎవ్వరూ నష్టపోవడం లేదు. ఇది మాత్రం నిజం..!