నందమూరి హీరో కళ్యాణ్ రామ్ రీసెంట్గా బింబిసార సినిమాతో సూపర్ హిట్ కొట్టేశాడు. ప్రస్తుతం కళ్యాణ్‌రామ్ లైనప్‌లో మంచి సినిమాలు, మంచి డైరెక్టర్లు ఉన్నారు. దీనికి తోడు బింబిసారకు సీక్వెల్ కూడా ఉంటుందంటున్నారు. ఇక కళ్యాణ్‌రామ్ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా ఎక్కువుగా యాక్షన్ సినిమాలు చేస్తూ వచ్చాడు. పటాస్ తర్వాత 118, బింబిసార సినిమాలే అతడికి మంచి హిట్ సినిమాలు అయ్యాయి.
ఇక కళ్యాణ్‌రామ్ చాలా సింపుల్‌గా ఉంటాడు. తనకు అంత బలమైన సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా కూడా అసలు ఎప్పుడూ దాని గురించి చెప్పుకునేందుకే ఇష్టపడడు. నిర్మాతగా కూడా తాను తీసిన సినిమాలకు నష్టం వస్తే డిస్ట్రిబ్యూటర్లు నష్టపోకుండా వాళ్లకు అడ్వాన్స్‌లు రిటర్న్ ఇచ్చేస్తాడు. కళ్యాణ్‌రామ్ భార్య స్వాతితో పాటు ఆయన ఫ్యామిలీ విషయాలు పెద్దగా బయటకు రావు.
ఇక కళ్యాణ్‌రామ్ భార్య స్వాతి కుటుంబం కూడా పెద్దదే. వాళ్లకు చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఆమె మెడిసిన్ చదివింది. స్వాతి కుటుంబానికి హైదరాబాద్ సమీపంలో పెద్ ఫార్మా కంపెనీలు ఉన్నాయి. స్వాతి సోదరుడు హరి కళ్యాణ్‌రామ్‌కు వ్యాపార వ్యవహారాలు, సినిమా నిర్మాణం విషయంలో ఎంతో సహాయంగా ఉంటాడు.
ఇక స్వాతి కూడా భర్తకు చాలా విషయాల్లో కోపరేట్ చేస్తూ ఉంటుంది. కళ్యాణ్ పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేసి సన్నబడడంలో బాగా ప్లానింగ్ చేసిందట. ఇజం సినిమా షూటింగ్ టైంలో ఇది జరిగిందని కళ్యాణ్ స్వయంగా చెప్పాడు. ఇక స్వాతి చదువుకునే రోజుల్లో కింగ్ నాగార్జునకు వీరాభిమాని. నాగ్ సినిమాలు ఆమె ఎక్కువుగా చూసేదట.
ఇక శర్వానంద్ నటించిన శతమానం భవతి సినిమా చూసిన స్వాతి మీరు ఇలాంటి ఫ్యామిలీ సినిమాలు ఎందుకు చేయరు ? అన్నీ యాక్షన్ సినిమాలే చేస్తారా ? అని ప్రశ్నించిందట. పాటలు, ఫైట్లు కంటే ఇలా సింపుల్‌గా ఉండే సినిమాలు చేయాలని సలహాలు ఇచ్చిందట. ఆ సినిమా ఆమెకు అంతగా నచ్చేసిందట.