Moviesశిల్పాశెట్టి TO హ‌న్సిక ఈ 10 మంది హీరోయిన్ల‌లో పెళ్లిలో ట్విస్టులు...

శిల్పాశెట్టి TO హ‌న్సిక ఈ 10 మంది హీరోయిన్ల‌లో పెళ్లిలో ట్విస్టులు ఇవే…!

సినిమా ప‌రిశ్ర‌మ‌లో హీరోయిన్ల‌కు లైఫ్ టైం చాలా త‌క్కువుగా ఉంటుంది. వాళ్లు ఎంత పాపుల‌ర్ అయినా.. ఎన్ని సినిమాలు చేసినా ఎంత సంపాదించుకున్నా ఈ టైంలోనే సంపాదించుకోవాలి. అందుకే క్రేజ్ ఉన్న‌ప్పుడే నాలుగు రాళ్లు వెన‌కేసుకోవాల‌న్న సిద్ధాంతంలో డిమాండ్ ఉన్న‌ప్పుడే రెమ్యున‌రేష‌న్ పెంచేస్తుంటారు. అయితే అనుష్క‌, న‌య‌న‌తార‌, త్రిష లాంటి త‌క్కువ మంది హీరోయిన్ల‌కు మాత్ర‌మే 10 – 15 ఏళ్ల కెరీర్ ఉంటుంది. ఇలా కెరీర్ ఉన్న హీరోయిన్లు త‌క్కువ మందే ఉంటారు.

అయితే కొంద‌రు హీరోయిన్లు మంచి ఫామ్‌లో ఉన్న‌ప్పుడే ప్రేమ పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అయిపోతూ ఉంటారు. ఎక్కువ మంది టాప్ హీరోయిన్లు బిజినెస్‌మేన్‌ల‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలా పెళ్లి చేసుకున్న 10 మంది హీరోయిన్లు ఎవ‌రో చూద్దాం.

1- శిల్పాశెట్టి :
బాలీవుడ్ భామ శిల్పాశెట్టి తెలుగులో సాహ‌స‌వీరుడు సాగ‌ర‌క‌న్య‌, భ‌లేవాడివి బాసు, ఆజాద్ సినిమాలు చేసింది. ఆమె ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త రాజ్‌కుంద్రాను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే అది రాజ్‌కుంద్రాకు రెండో పెళ్లి అని టాక్ ?


2- ఇషా కొప్పిక‌ర్ :
తెలుగులో చంద్ర‌లేఖ‌, ప్రేమ‌తో రా సినిమాలు చేసిన బాలీవుడ్ భామ ఇషా కొప్పిక‌ర్ ముంబైలో ఎన్నో హోట‌ల్స్‌కు అధిప‌తి అయిన టిమ్మీ నారంగ్‌ను పెళ్లి చేసుకుంది.

3- ఆశిన్ :
గ‌జినీ సినిమాతో నేష‌న‌ల్ వైడ్‌గా సూప‌ర్ పాపుల‌ర్ అయ్యింది ఆశిన్‌. ఆమె తెలుగులో శివ‌మ‌ణి, ఘ‌ర్ష‌ణ‌, ల‌క్ష్మీ న‌ర‌సింహా లాంటి సినిమాలు చేసింది. ఆమె మైక్రో మ్యాక్స్ సీఈవో రాహుల్ శ‌ర్మ‌ను ప్రేమ వివాహం చేసుకుంది.


4- రీమాసేన్ :
చిత్రం, మ‌న‌సంతా నువ్వే, వ‌ల్ల‌భ‌, బావ న‌చ్చాడు, సీమ‌సింహం సినిమాలు చేసిన రీమాసేన్ బిజినెస్‌మేన్ శివ‌క‌ర‌ణ్‌సింగ్‌ను పెళ్లాడింది.


5- అయేషా ట‌కియా :
తెలుగులో నాగార్జున‌తో సూప‌ర్ సినిమా చేసిన అయేషా ఆ త‌ర్వాత సినిమాల‌కు దూర‌మై హోట‌ల్ బిజినెస్‌లో ఆరితేరిన ఫ్యామిలీ, పొలిటిషీయ‌న్ అయిన అబూ అజ్మీ కొడుకు ఫ‌ర్హాన్ అజ్మీని పెళ్లాడింది.

6- ప్రియ‌మ‌ణి :
పెళ్లైన‌కొత్త‌లో, ర‌గ‌డ‌, రాజ్‌, ద్రోణ‌, నార‌ప్ప సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌రైన ప్రియ‌మ‌ణి ఈవెంట్ ఆర్గ‌నైజింగ్ బిజినెస్ చేసే ముస్త‌ఫారాజ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది.


7- పూర్ణ :
అవును, అవును 2, సీమ‌ట‌పాకాయ్‌, అఖండ‌, దృశ్యం 2 సినిమాల భామ పూర్ణ దుబాయ్‌లో వ్యాపారాలు చేసే సానిద్ ఆసిఫ్‌ను పెళ్లి చేసుకుంది.


8- న‌దియా :
ఒక‌ప్ప‌టి క్రేజీ హీరోయిన్ న‌దియా ఇప్పుడు మిర్చి, అత్తారింటికి దారేది సినిమాలతో పాపుల‌ర్ అయ్యింది. ఆమె ప్ర‌ముఖ బిజినెస్ మేన్ శిరీష్ గాడ్‌బోలేను పెళ్లాడింది. శిరీష్ న‌దియాకు చిన్న‌ప్పటి స్నేహితుడే.

9- కాజ‌ల్ :
కాజ‌ల్ తెలుగులో ఎంత పాపుల‌రో తెలిసిందే. మ‌గ‌ధీర లాంటి ఇండ‌స్ట్రీ హిట్‌తో మొద‌లు పెట్టి ఎంతో మంది సీనియ‌ర్ హీరోలు, జూనియ‌ర్ల‌తో కూడా న‌టించింది. కాజ‌ల్ త‌న చిన్న‌ప్ప‌టి ఫ్రెండ్ గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడింది.


10- హ‌న్సిక :
ఇక తాజాగా హ‌న్సిక త‌న ప్రెండ్ మాజీ భ‌ర్త‌, స్నేహితుడు అయిన సోహైల్ క‌టూరియాను పెళ్లాడ‌బోతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news