Moviesస‌మంత ప‌రిస్థితి ఇంత క్రిటిక‌ల్‌గా ఉందా... ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా...!

స‌మంత ప‌రిస్థితి ఇంత క్రిటిక‌ల్‌గా ఉందా… ఇంత‌క‌న్నా సాక్ష్యం కావాలా…!

ఏదేమైనా చెన్నై చిన్న‌ది, స్వీటీబ్యూటీ స‌మంత హెల్త్ చాలా క్రిటిక‌ల్‌గానే ఉందా ? అన్న సందేహాలు అంద‌రిలోనూ క‌లుగుతున్నాయి. స‌మంత తాను మ‌యోసిటీస్ అనే వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్టు చెప్పి అంద‌రికి షాక్ ఇచ్చింది. నిజానికి స‌మంత‌కు ముందు నుంచి హెల్త్ ప్రాబ్ల‌మ్స్ ఉన్నాయి. ఆమె కెరీర్ ప‌రంగా ఫుల్ ఫామ్‌లో ఉన్న‌ప్పుడే స్కిన్ డిసీజ్‌తో బాధ‌ప‌డింది. ఇందుకోసం ఆమె కేర‌ళ‌లో ఆయుర్వేద చికిత్స‌తో పాటు విదేశాల్లోనూ ట్రీట్‌మెంట్ తీసుకుంది.

 

ఈ వ్యాధి ఇంకా ఆమెను వెంటాడుతూనే ఉంద‌ని అంటూ ఉంటారు. ఇలాంటి టైంలో ఆమె స్వ‌యంగా త‌న‌కున్న మ‌రో వ్యాధి గురించి చెప్ప‌డంతో ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై స‌హ‌జంగానే సందేహాలు వ‌స్తున్నాయి. స‌మంత త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌లువురు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెకు ధైర్యం చెపుతున్నారు. ఇక ఆమె మాజీ భ‌ర్త నాగ‌చైత‌న్య కూడా స్వ‌యంగా హాస్ప‌ట‌ల్‌కు వెళ్లి సమంత త్వ‌రగా కోలుకోవాల‌ని ధైర్యం చెప్పిన‌ట్టు కూడా తెలుస్తోంది.

ఏదేమైనా స‌మంత ఆరోగ్య ప‌రిస్థితి కాస్త క్రిటిక‌ల్‌గా ఉంద‌నేందుకు ఖుషి సినిమా వాయిదాయే కార‌ణం అని కూడా చెపుతున్నారు. మామూలుగానే ఈ సినిమాను డిసెంబ‌ర్లో రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. డిసెంబ‌ర్ మూడో వారంలో రిలీజ్ డేట్ అనుకున్నారు. స‌మంత‌కు ఆరోగ్యం బాగో లేక షూటింగ్‌కు రాక‌పోవ‌డంతో ఫిబ్ర‌వ‌రి 10న రిలీజ్ అని మార్చారు.

ఇప్పట్లో స‌మంత షూటింగ్‌కు వ‌చ్చే ఛాన్సులు లేక‌పోవ‌డంతో ఖుషి రిలీజ్ డేట్ మ‌రోసారి వాయిదా ప‌డింది. మైత్రీ వాళ్లు ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రిలో కాకుండా స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. స‌మంత‌కు మ‌రి కొద్ది రోజులు విశ్రాంతి అవ‌స‌రం అని.. క‌నీసం నెల రోజుల పాటు ఆమె బ‌య‌ట‌కు వ‌చ్చే ఛాన్సే లేదంటున్నారు. ఆమె కోలుకుంటే డిసెంబ‌ర్ నుంచి ఖుషి సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది.

ఈ సినిమా షూటింగ్ లేట్ అయ్యే ఛాన్సులు ఉండ‌డంతో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ కూడా మ‌రో సినిమాను ప‌ట్టాలెక్కించే ప్లానింగ్‌లో ఉన్నాడు. అందుకే గీతా, దిల్ రాజు, సితార సంస్థ‌లతో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడ‌ట‌.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news