టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ బాక్సాఫీస్ దగ్గర ఏ విషయంలో పోటీ పడినా ఇంట్రస్టింగే. వారి సినిమాలు సంక్రాంతికి వచ్చినా, మామూలు టైంలో ఒకేసారి రిలీజ్ అయినా, బుల్లితెరపై వారు హోస్ట్ చేసిన టాక్ షోల టీఆర్పీలు అయినా, సినిమాల కలెక్షన్లు, రికార్డులు అయినా వాటి మధ్య కంపేరిజన్ వస్తుంది. బాలయ్య – చిరు మధ్య కంపేరిజన్ పోటీ ఈ నాటిది కాదు… ఇది ఏకంగా మూడు దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది.
2017 సంక్రాంతి కానుకగా వీరిద్దరు కెరీర్లోనే ప్రతిష్టాత్మకమైన సినిమాలతో పోటీ పడ్డారు. చిరు 150వ సినిమా ఖైదీ నెంబర్ 150, బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలు రిలీజ్ అయ్యాయి. రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక వచ్చే సంక్రాంతికి కూడా వీరిద్దరు బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతూ హీటెక్కించేస్తున్నారు. చిరు వాల్తేరు వీరయ్య, బాలయ్య వీరసింహారెడ్డి సినిమాలు సంక్రాంతికే వస్తున్నాయి.
ఇద్దరిలోనూ ఎవ్వరూ వెనక్కు తగ్గేలా లేరు. సంక్రాంతి పోరులో ఎవరు పైచేయి సాధిస్తారన్న చర్చ నడుస్తుండగానే ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. చిరు నటించిన డిజాస్టర్ ఆచార్య తాజాగా బుల్లితెరపై ప్రసారమైంది. ఈ సినిమా థియేటర్లలోనే సరిగా ఆడలేదు. దీనికి తోడు టీవీల్లో వేస్తే ఫస్ట్ టైం 6.30 టీఆర్పీ వచ్చింది. ఇది చాలా పెద్ద నంబర్ అంటూ మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.
అయితే వాస్తవానికి ఇది చిరు లాంటి హీరోకు చాలా చాలా తక్కువ. ఇటీవల లేదా ఈ యేడాది టీవీల్లో ప్రసారమైన పెద్ద సినిమాల టీఆర్పీ చూస్తే నాగార్జున బంగార్రాజు 4 – అఖండ 13.3 – ఎఫ్3 8.2 సినిమాలకు ఆచార్య కంటే ఎక్కువ రేటింగ్ వచ్చింది. చిరు సైరాకు కూడా చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. ఏదేమైనా బాలయ్య, చిరు రీసెంట్ సినిమాలతో కంపేరిజన్ చేస్తూ బాలయ్య అఖండకు వచ్చిన రేటింగ్లో చిరు సినిమాకు సగం మాత్రమే వచ్చింది. అలా చిరుపై బాలయ్య పై చేయి సాధించినట్లయ్యింది. మరి సంక్రాంతికి ఎవరు పై చేయి సాధిస్తారో ? చూడాలి.