కర్ణాటక లోని కొంకణి తండ్రికి, మలయాళ తల్లికి ముంబైలో 1974 లో జన్మించింది దేవయాని. ఆమెకు ఇద్దరు తమ్ముళ్లు ఉండగా అందులో నకుల్ కూడా తమిళ నటుడే. ఇక ఆమె తన కెరీర్ బెంగాలీ సినిమాల ద్వారా మొదట ప్రారంభించి మలయాళ సినిమాలతో పాపులర్ అయ్యింది. దిల్ కా డాక్టర్ అనే హిందీ సినిమాలో బాలీవుడ్ లో కూడా డెబ్యూ చేసింది దేవయాని. ఇక తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో పాటు బెంగాలీ మరియు హిందీ సినిమాల్లో కెరీర్ మొత్తం మీద వందకు పైగా సినిమాల్లో నటించింది.
హీరోయిన్ గా కెరీర్ పీక్ లో ఉన్న సమయంలో సైతం ఆమె పెద్దగా వివాదాల జోలికి వెళ్ళలేదు. అయితే ఆమె తమిళ దర్శకుడు రాజ్ కుమారన్‌తో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసింది. కానీ ఆమె పెళ్లికి ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వారిని ఎదురించి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతానికి దేవయానికి ఇద్దరు కూతుళ్లు. సినిమాల్లో కెరీర్ ముగిసిపోయాక టెలివిజన్ పైన ఫోకస్ చేసింది దేవయాని.
ఆమె సన్ టీవీ వారికి చేసిన కోలంగళ్ అనే సీరియల్ 1500 పైగా ఎపిసోడ్స్ ప్రసారం అయ్యి దేవయానికి మంచి గుర్తింపు తీసుకచ్చింది. ఆలా ఆమె కొన్నేళ్ల పాటు సీరియల్స్ లో బిజీ గా కెరీర్ కొనసాగించింది.
మలయాళంలో సైతం ఈ సీరియల్ మెగా హిట్ ని దక్కించుకుంది. మాజవిల్ మనోరమ అనే రియాలిటీ షోకి జడ్జి గా కూడా పని చేసింది. పెళ్లయ్యాక కూడా చాల సినిమాల్లో నటించిన దేవయాని ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అనేక సినిమాల్లో నటిస్తుంది.
తన కూతుళ్లను స్కూల్ లో జాయిన్ చేసే క్రమం లో చర్చ్ పార్క్ కాన్వెంట్ లో దేవయాని స్కూల్ టీచర్ గా కూడా పని చేసింది. ఇక ఆమె భర్త రాజ్ కుమారన్ సినిమా నిర్మాణం చేసి చేతులు కాల్చుకొని ఆస్తులను హరించేశాడు. దాంతో ఆమె సినిమాల్లో నటించక తప్పని పరిస్థితి తలెత్తి టీచర్ ఉద్యోగం మానేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ కి భార్యగా ఆమె నటన అద్భుతం.
ఆమె సినిమా జీవితం పక్కకు పెడితే రాజ్ కుమారన్ తో ప్రేమలో పాడటానికి ముందు ఆమె ఒక వివాదాస్పద ప్రేమ వ్యవహారం నడిపింది. తమిళంలో స్టార్ హీరోగా ఉన్న శరత్ కుమార్ ఆమెను ఎంతగానో ప్రేమించాడు. వీరిద్దరూ కలిసి మూవెందర్, ఒరువన్, సూర్య వంశం, పాట్టాలి వంటి అనేక సినిమాల్లో నటించి మంచి కెమిస్ట్రీ ఉన్న పెయిర్‌గా తమిళనాట గుర్తింపు తెచ్చుకున్నారు.
వీరు చాలా రోజుల పాటు డేటింగ్ చేయగా దేవయాని ఇంట్లో వీరి పెళ్లికి అనుమతి దొరకలేదు. దాంతో ఆమె శరత్ కుమార్ తో బ్రేకప్ చెప్పింది. ఆ తర్వాత ఎవరికి వారు వివాహం చేసుకొని వారి వారి జీవితాల్లో సెటిల్ అయ్యారు. ఇందులో దేవయాని జీవితం సజావుగానే సాగినా శరత్ కుమార్ మాత్రం ఇద్దరు కూతుళ్లు పుట్టాక విడాకులు తీసుకొని రాధికను మళ్లి పెళ్లి చేసుకున్నాడు.