Moviesకాంత‌మ్మ‌త్త కూర‌లంటే ఎన్టీఆర్‌కు అంత ఇష్ట‌మా... ఎవ‌రా కాంత‌మ్మ‌త్త‌...!

కాంత‌మ్మ‌త్త కూర‌లంటే ఎన్టీఆర్‌కు అంత ఇష్ట‌మా… ఎవ‌రా కాంత‌మ్మ‌త్త‌…!

సాధార‌ణ జీవితంలో ఎంతో సిన్సియ‌ర్‌గా ఉండే ఎన్టీఆర్‌.. సినీ జీవితంలో మాత్రం చాలా జోష్‌గా ఉండేవారు. త‌న‌కు సీనియ‌ర్ న‌టుల ప‌ట్ల ఎంతో గౌర‌వం ఉండేది. ఇలా.. ఎంతో మంది విషయంలో ఎన్టీఆర్ చాలా గౌర‌వంగా.. ఆప్యాయంగా ఉండేవారు. కానీ, అల‌నాటి.. విల‌నీ క్యారెక్ట‌ర్ సూర్య‌కాంతం విష‌యంలో మాత్రం అన్న‌గారు ఎన్టీఆర్ ఆట‌ప‌ట్టించేవార‌ట‌. సూర్య‌కాంతం గురించి కూడా.. నేటి త‌రానికి చాలా మందికి తెలియ‌దు. ఆమె చాలా కష్ట‌ప‌డి పైకి వ‌చ్చారు.

స్టేజ్ ప్రోగ్రామ్ చేయ‌డంతోపాటు.. నాటిక‌లు.. కూడా వేసేవారు. స‌త్య హ‌రిశ్చంద్ర నాట‌కంలో న‌ట‌నను మెచ్చిన అప్ప‌టి ప్ర‌ఖ్యాత‌ ద‌ర్శ‌కుడు సీ.పుల్ల‌య్య‌ తొలి ఛాన్స్ ఇచ్చారు. ఇక‌, ఆత‌ర్వాత‌.. సూర్య‌కాంతం వెన‌క్కి తిరిగి చూసుకోలేద‌ని అంటారు. ఇలా.. సినీరంగంలోకి ప్ర‌వేశించిన సూర్య‌కాంతం.. పేరును మారుస్తామ‌నే ప్ర‌తిపాద‌న వ‌చ్చిన‌ప్పుడు.. ఆమె నిర్ద్వంద్వంగా ఖండించార‌ట‌. త‌ల్లిదండ్రులు పెట్టిన పేరు తీసేయ‌డానికి మీరెవ‌రు..? అంటూ.. అప్ప‌టి ద‌ర్శ‌కుడు సీ.పుల్ల‌య్య‌పైనే దెబ్బ‌లాడింద‌ట‌.

నిజానికి సీ. పుల్ల‌య్య అంటే.. న‌టీన‌టుల‌కు ఎంతో గౌర‌వం. ఆయ‌న ఒక్క మాట అన్నారంటే అది జ‌రిగి తీరుతుంది. కానీ, సూర్యాకాంతం విష‌యంలో మాత్రం ఆమె మాటే నెగ్గింది. దీంతో ఆమె గ‌య్యాళి.. అనే పేరు స్థిర‌ప‌డిపోయింది. ఇక‌, అప్ప‌టి నుంచి ఆమెకు యాంటీ కారెక్ట‌ర్లు ఇవ్వ‌డం ప్రారంభించారు. మీరు ఏదిస్తే..అదే చేస్తా! అంటూ.. ఏమాత్రం వెన‌క్కి త‌గ్గ‌కుండా సూర్య‌కాంతం త‌న స‌త్తాను నిరూపించుకున్నారు.

ఇదిలావుంటే, కొన్ని సినిమాల త‌ర్వాత‌.. సూర్య‌కాంతం బాగానే పుంజుకున్నారు. హీరోయిన్ల‌తో స‌మానంగా రెమ్యున‌రేష‌న్ తీసుకున్న క్యారెక్ట‌ర్ న‌టిగా ఆమెపేరు తెచ్చుకున్నారు. ఇదిలావుంటే.. ఎన్టీఆర్‌కు.. సూర్యకాంతానికి మ‌ధ్య అత్త అల్లుడు బంధం ఏర్ప‌డింది. దీంతో అన్న‌గారు సూర్య‌కాంతాన్ని కాంత‌మ్మ‌త్త‌! అని సంబోధించ‌డం ప్రారంభించారు. ఇక్క‌డ మ‌రో విష‌యం చెప్పుకోవాలి. త‌ను షూటింగుకు వ‌స్తుంటే సూర్య‌కాంతానికి ఒక‌ల‌క్ష‌ణం ఉండేది.

హీరోలు, హీరోయిన్లు.. ఇత‌ర పాత్ర‌ధారులు ఇలా.. దాదాపు 50 మందికి భోజ‌నాలు తెచ్చేవార‌ట‌. ముఖ్యంగా అప్పుడే కోసిన కూర‌గాయ‌ల‌తో స్వ‌యంగా చేసిన వంట‌కాలు తెచ్చేవార‌ట‌. అదేవిధంగా వేస‌వి వ‌స్తే.. దాదాపు అంద‌రికీ ఆవిడే ఆవ‌కాయ పెట్టి పంపించేవార‌ట‌. ఇలా.. అన్న‌గారు సూర్య‌కాంతం వంట‌కాల‌కు అల‌వాడు ప‌డిపోయి.. కాంత‌మ్మ‌త్త‌ కూర‌ల కోసం వెయింట్ కూడా చేసిన సంద‌ర్భాలు ఉన్నాయ‌ని అంటారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news