Moviesఓ మై గాడ్: ఇంద్ర నీల్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? ఇది...

ఓ మై గాడ్: ఇంద్ర నీల్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడా..? ఇది నిజంగా దిమ్మ తిరిగిపోయే షాకే..!!

సినిమా ఇండస్ట్రీలో లవ్, ఎఫైర్, డేటింగ్ , రెండో పెళ్లిళ్లు , మూడో పెళ్లిళ్లు చాలా కామన్. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సినీ స్టార్స్ అందరూ ఉన్న భార్యలకు విడాకులు ఇచ్చేసి.. రెండో పెళ్లిపై మోజు పడుతూ కొత్త రుచులు కోరుకుంటూ డేటింగ్ అనే సాంప్రదాయాన్ని సినీ ఇండస్ట్రీలో పాతుకుపోయేలా చేస్తున్నారు . అయితే ఇప్పుడు అలాంటి రెండో పెళ్లి విషయంలో బుల్లితెర నటుడు ఇంద్రనీల్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

ప్రస్తుతం బుల్లితెరపై నెం 1 టీఆర్పి రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ ఇంటింటి గృహలక్ష్మి . ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో కస్తూరి నటించి అభిమానులు మెప్పిస్తుంది. కాగా ఈ మధ్యన ఈ సీరియల్ లోకి ఎంటర్ అయిన ఇంద్రనీల్ తనదైన స్టైల్ లో నటిస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు . కాగా రీసెంట్గా టైమ్స్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రనీల్ మాట్లాడుతూ రెండో పెళ్లి విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశాడు .

ఆయన మాట్లాడుతూ..” ప్రజెంట్ మనం 2022 జనరేషన్ లో ఉన్నాం . ఈ సమాజంలో రెండో వివాహాన్ని చేసుకున్న వారిని నేను స్వాగతిస్తున్నాను. మనం ఒక మనిషిని నమ్మి ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న తరువాత..ఆ వ్యక్తితో మనకి మ్యాచ్ అవ్వనప్పుడు ..కలిసి బ్రతికి బాధపడడం కన్నా ..విడిపోయి మన మనసుకు దగ్గరైన మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండటంలో తప్పులేదు .రెండో పెళ్లి అనేది చట్టబద్ధంగా చేసుకుంటే ఏ ప్రాబ్లం లేదు. అదేదో పాపం అన్నట్లు ఎందుకు అందరు దాన్ని నెగిటివ్గా చూస్తున్నారు. ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక తోడు కావాలి. మనకి నచ్చిన వ్యక్తి ఆ తోడుగా వస్తే మన లైఫ్ ఇంకా బాగుంటుంది .. తనకు నచ్చే విధంగా గడపడం ప్రతి మానవుడి హక్కు.. ప్రతి ఒక్కరికి తమ జీవితం పట్ల స్వేచ్ఛ ఉండాలి. తమకు నచ్చిన వ్యక్తితో ఉండడం తప్పేం కాదు ..ఎవరి ఇష్టం వారిది ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు “అంటూ చెప్పుకొచ్చారు.

 

ఈ క్రమంలోనే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఇంద్ర నీల్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ధంబ్ నైల్స్ పెట్టి మరి ఆ న్యూస్ వైరల్ చేస్తుంది . కాగా ఈ సీరియల్ లో ఇంద్రనీల్ త్వరలోనే తులసిని రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని అందుకే ఇలాంటి కామెంట్స్ చేశారని చెప్పుకొస్తున్నారు ఆయన ఫ్యాన్స్. చూడాలి మరి తులసి ఏం చేస్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news