Moviesసల్మాన్ కి డెంగ్యూ వస్తే ప్రభుత్వం పరేషన్... అదే పేదలకు జ్వరం...

సల్మాన్ కి డెంగ్యూ వస్తే ప్రభుత్వం పరేషన్… అదే పేదలకు జ్వరం వస్తే.. ఏం చశారు సారూ..!!

మనకు తెలిసిందే బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గత వారం రోజుల నుంచి డెంగ్యూ ఫీవర్ తో బాధపడుతున్నాడు. ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నాడు . ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతున్నట్లు తెలుస్తుంది . రెండు మూడు రోజుల్లో హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి మళ్లీ యధావిధిగా తన పనులను కొనసాగించుకోనున్నాడు. అయితే ఈ క్రమంలోని బహున్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు టూమచ్ గా బిహేవ్ చేస్తున్నారు.

సల్మాన్ ఖాన్ కి డెంగ్యూ ఫీవర్ వచ్చిందో లేదో సల్మాన్ ఖాన్ ఉండే ఏరియా మొత్తం దోమల మందు కొడుతూ.. నీట్ గా, క్లీన్ గా ఉంచడానికి హంగామా చేశారు . మరి ముఖ్యంగా ఆయన ఉండే బృందా గెలాక్సీ అపార్ట్మెంట్లో డెంగ్యూ సృష్టించే పెద్ద దోమలు ఉన్నాయాఅంటూ స్పెషల్ ఫోకస్ చేశారు. ఆయన ఉండే ఇంటి చుట్టూరు వారం రోజుల నుంచి హై అటెన్షన్ పెట్టారు .దోమల వృత్తికి కారణమైన ప్రదేశాలను గుర్తించిఆ ప్రదేశాల్లో దోమలు నివారణ మందును స్ప్రే చేశారు మున్సిపల్ అధికారులు.

దీంతో ఒక్కసారిగా సామాన్య జనాలకు కడుపు మండిపోయింది . అదే సామాన్య ప్రజలకు ఇలాంటి ఫీవర్ వచ్చి మరేదైనా ఫీవర్ వచ్చి బాధపడుతుంటే ప్రభుత్వం పట్టించుకుంటుందా ..? కేవలం సల్మాన్ ఖాన్ కి బాగా లేకపోతే మాత్రమే ప్రభుత్వం ఇలా చేస్తుందా? ఆయనవే ప్రాణాలా..? మాది ప్రాణాలు కావా అంటూ సామాన్య ప్రజలు మండిపడుతున్నారు . ముందు నుంచి ఆ జాగ్రత్త ఉండాలని కేవలం సల్మాన్ ఖాన్ కి డెంగ్యూ వచ్చిందని చెప్పి ఇలా చేయకూడదని సూటిగా ప్రశ్నిస్తున్నారు . మరి దీనికి ముంబై ప్రభుత్వం ఎలా సమాధానం చెబుతుందో చూడాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news