టాలీవుడ్ లో నటి ప్రగతి అంటే పరిచయం అక్కర్లేని పేరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రగతి ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. అత్త, తల్లి లాంటి పాత్రలు చేసి ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఈ వయస్సులోనూ జిమ్‌లో వర్కవుట్లు చేస్తూ, తన మజిల్స్‌తో పాటు ఫిగర్ ఎక్స్‌పోజింగ్‌తో కుర్ర హీరోయిన్లకే మతులు పోగొట్టేలా ఉంటుంది. ఆమె సినిమాల్లో గడ్డు అత్త క్యారెక్టర్‌లో చెప్పే డైలాగులు రీయల్‌గా గడ్డు ఆంటీలు ఇలాగే ఉంటారా అనిపించేంత పెర్పామెన్స్ ఇస్తుంది.
అయితే ప్రగతి ఒకప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా కూడా సినిమాలు చేసింది అన్న సంగతి చాలా మందికి తెలియదు. ప్రగతి హీరోయిన్ గా చేసింది చాలా తక్కువ సినిమా మాత్రమే. కొన్ని సినిమాలు చేసి ఆ తరవాత సీరియల్స్ కు షిఫ్ట్ అయ్యింది. నిజానికి ప్రగతి అప్పట్లో స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన అందంతో ఉండేదట. కానీ ఓ డైరెక్టర్ చేసిన పని వల్లనే సీరియల్స్ కు మారిందట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో ప్రగతి వెల్లడించింది.
ఓ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సమయంలో రెయిన్ డ్యాన్స్ కోసం దర్శకుడు ఇబ్బందికరంగా ఉన్న బట్టలను వేసుకోవాలని దర్శకుడు పట్టుబట్టారట. దానికి తాను ఒప్పుకోలేదట. అంతే కాకుండా అప్పటి నుండే సినిమాలలో నటించకుండా సీరియల్స్ వైపు వెళ్లానని ప్రగతి వెల్లడించింది. కొంతకాలం సీరియల్స్ కే పరిమితమైన ప్రగతి మహేశ్ బాబు హీరోగా నటించిన బాబి సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్నారు.
ఇక సినిమాల్లోకి వచ్చిన తరవాత ఆమెకు చిన్న వయసులోనే తల్లి పాత్రలు వచ్చాయట. దాంతో ఏడ్చేదానినని ప్రగతి వెల్లడించింది. నటుడు చంద్రమోహన్ కుటుంబంతో తనకు మంచి సంబంధాలు ఉండేవని ఆయన భార్యను ఆంటీ అని పిలిచేదానినని పేర్కొంది. అంతే కాకుండా ఆయన పక్కన ఓ సినిమాలో నటించానని ప్రగతి పేర్కొంది. తన వయసులో ఉండే హీరోయిన్లు తనను అమ్మా అని పిలుస్తుంటే బాధగా ఉండేదని చెప్పింది.
అంతే కాకుండా షూటింగ్ కు స్టైల్ గా రెడీ అయ్యి వస్తే తల్లి పాత్రలు చేసే ఈవిడకు ఇలాంటి స్టైల్స్ అవసరమా ? అంటూ సూటిపోటి మాటలు అనేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ సమయంలోతాను మేకప్ రూమ్ లోకి వెళ్లి గట్టిగా ఏడ్చేదాన్ని అంటూ బాధపడింది.