సీనియర్ నటీమణులు కూడా కమిట్మెంట్ అంటే కమాన్ అంటున్నారా..? అనేది గతకొంతకాలంగా అటు నెటిజన్స్ ఇటు జనాలలో కలుగుతున్న సందేహాలు. ఇప్పుడు యంగ్ హీరోయిన్స్ అందరూ దేనికైనా రెడీ అనేలా ఉన్నారనేది ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్న మాట. అంతేకాదు, కొన్నేళ్లు వాళ్ళ ఉనికి చాటుకోవాలంటే ఎంత ఘాటు సన్నివేశాలలో నటించడానికైనా ఒకే…సెమీ న్యూడ్‌గా నటించడానికి రెడీగా ఉంటున్నారు. ఇప్పుడు సీరియల్ నటీమణుల్లో కూడా కొందరు బాగా పాపులర్ అవుతున్నారు.
సీరియల్స్‌లో శారీ కట్టుకొని డీసెంట్ రోల్స్ చేస్తున్నవారు కూడా బయట చూస్తే గుర్తుపట్టలేనంత అల్ట్రా మోడ్రన్‌గా కనిపిస్తున్నారు. వారి టార్గెట్ కూడా సిల్వర్ స్క్రీన్ మీదకి రావాలనే. కానీ, అందరు సీరియల్ యాక్ట్రెస్ సినిమాలలో నటించే అవకాశాలను అందుకోలేకపోతున్నారు. దీనికి కారణం సీరియల్ నటీమణులు కనిపిస్తే సినిమా ఫ్లేవర్ మారిపోతుందనేది చాలామంది అభిప్రాయం. అయితే, ఇప్పుడు హీరోయిన్స్ లెవల్లో కొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులు..సీనియర్ నటీమణులు చెలరేగిపోతున్నారు.
పెళ్ళైన పిల్లలున్నా..పెళ్లీడుకొచ్చిన కూతుళ్ళునా వారితో పోటీ పడి అల్ట్రా మోడ్రన్ డ్రస్సులేసుకొని నెటిజన్స్‌కి హీటెక్కిస్తున్నారు. ప్రగతి గురించి ఇటీవల సోషల్ మీడియాలో ఎంత హాట్ టాపిక్ అవుతుందో అందరికీ తెలిసిందే. అలాగే సురేఖావాణి కూడా. ఇటీవల ఆమె సినిమాలలో కూడా పెద్దగా కనిపించడం లేదు. కానీ, కూతురుతో కలిసి సందడి చేస్తున్న ఫొటోలు, వీడియోలు మాత్రం నెట్టింట బాగా చక్కర్లు కొడుతున్నాయి. ఇక కొందరు సీనియర్స్ కూడా వయసు చాచుకొని అందాల ఆరబోతతో మోత మోగిస్తున్నారు.
అంతేకాదు, లోలోపల వినిపిస్తున్న టాక్ ప్రకారం పవిత్రా లోకేష్, ప్రగతి లాంటి మరికొందరినీ కొందరు దర్శకులు మరో రకంగా అడిగి ఇబ్బంది పెడుతున్నారట. ఇది బయటకి వినిపించకపోయినా యూట్యూబ్ ఛానల్స్‌లో కొందరు తెగేసి చెప్పేస్తున్నారు. ఇక్కడ ఏజ్‌తో సంబంధం లేదు. సినిమా కావాలంటే కమిటవ్వాల్సిందే అని నిర్మొహమాటంగా వాపోతున్నారు. సీనియర్స్ అయినా కొత్తవారైనా ఛాన్స్ కోసం దేనికైనా రెడీ అనాల్సిందే అని బాహాటంగానే చెప్పుకుంటున్నారు.