MoviesSr NTR, Jr NTR మ‌ధ్య ఈ కామ‌న్ పాయింట్లు చూశారా......

Sr NTR, Jr NTR మ‌ధ్య ఈ కామ‌న్ పాయింట్లు చూశారా… సేమ్ టు సేమ్‌..!

దివంగత విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు సీనియర్ రంగంలో మకుటం లేని మహారాజుగా ఎదిగారు. ఆయన మనవడిగా తెలుగు సినిమా పరిశ్రమలో అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ సైతం అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు తాతకు తగ్గ మనవడు అనిపించుకుంటున్నాడు. ఇక వీరిద్దరిలో కొన్ని కామన్ పాయింట్లు ఉన్నాయి. నాడు తాత ఎలాంటి లక్షణాలతో సినీ, రాజకీయ రంగంలో స్టార్ గా ఎదిగారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా తాత లక్షణాలు పుణికిపుచ్చుకొని అదే పంథాలో ముందుకు సాగుతున్నాడు. వీరిద్దరి మధ్య ఉన్న కొన్ని కామన్ పాయింట్లు తెలుసుకుందాం.

1 – శ్రమించే తత్వం:
సీనియర్ ఎన్టీఆర్ టీనేజ్‌లో ఉన్నప్పుడు ఎంతో కష్టపడ్డారు. ఆయన ఇంటింటికి పాల ప్యాకెట్లు వేసి వచ్చిన డబ్బులతో జీవనం కొనసాగించేవారు. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక.. వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకొని చిన్న వయసులోనే స్టార్ హీరోగా ఎదిగారు. అలా తాతకు తగ్గ మనవడిగా జూనియర్ ఎన్టీఆర్ సైతం కేవలం 21 సంవత్సరాలకే మూడు సూపర్ హిట్ సినిమాలతో నటుడిగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్నారు. కేవలం 21 సంవత్సరాలకే అచ్చు గుద్దినట్టు తాత పోలికలతో పాటు నటనలో కూడా ఎన్టీఆర్‌ను దింపేయడంతో తెలుగు ప్రేక్షకులు ఎన్టీఆర్‌కు ఫిదా అయిపోయారు.

2- పౌరాణిక పాత్రలపై ప్రేమ :
ఎన్టీఆర్ కి పౌరాణిక పాత్రలంటే చాలా ఇష్టం. కృష్ణుడు, రాముడు, ధుర్యోధ‌నుడు, రావ‌ణుడు వంటి దేవుళ్ల పాత్రలు, రాక్ష‌సుల పాత్ర‌లు చేసేందుకు ఆయ‌న ఎప్పుడూ వెనుకాడ‌లేదు. ఎన్టీఆర్ ఏ పౌరాణిక పాత్ర చేసినా మెప్పించారు. తాతకు ఉన్నట్లే తారక్ కి కూడా పౌరాణిక పాత్రలంటే ఎంతో ప్రాణం. అందుకే య‌మ‌దొంగ సినిమాలో య‌ముడిగా, జై ల‌వ‌కుశ సినిమాలో రావ‌ణుడి పాత్ర‌లో జీవించి తాత‌కు త‌గ్గ మ‌న‌వ‌డినే అనిపించుకున్నాడు.

3 – క్లాస్‌, మాస్ పాత్ర ఏదైనా జీవించేయాల్సిందే…
హీరోల‌కు స్టార్ ఇమేజ్ వచ్చినప్పుడు కొన్ని పాత్రలకే పరిమితం అవుతూ ఉంటారు. ఎన్టీఆర్ నెంబ‌ర్ వ‌న్‌గా ఉన్న‌ప్పుడు కూడా మిస్స‌మ్మ‌, బ‌డిపంతులు లాంటి డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్లు చేశారు. ఇక జూనియ‌ర్ కూడా ల‌వ‌ర్ బాయ్‌, మాస్‌, ఫ్యాక్ష‌న్‌, పౌరాణికం ఇలా ఏ పాత్ర‌ల్లో అయినా చేశారు.

4- ల‌క్కీ నెంబ‌ర్ 9 :
సీనియర్ ఎన్టీఆర్‌కు ల‌క్కీ నెంబ‌ర్ 9. ఆయ‌న సీఎం అయిన‌ప్పుడు కూడా ఆయ‌న కారుకు 9999 నెంబ‌ర్ ఉండేది. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు కూడా 9 ల‌క్కీ నెంబ‌ర్‌. జూనియ‌ర్ కారుకు కూడా 9999 ల‌క్కీ నెంబ‌ర్‌గా ఉంది. ఫ్యాన్సీ రేటు చెల్లించి మ‌రీ ఎన్టీఆర్ ఈ కారు నెంబ‌ర్ సొంతం చేసుకున్నాడు.

5- ప్రజాసేవ‌లో ముందంజ :
ఎన్టీఆర్‌ను అప్ప‌ట్లో ప్ర‌జ‌లు అంద‌రూ దైవంగా భావించేవారు. అందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ముఖ్య‌మంత్రి అయ్యి, పేద‌ల‌కు అనేక ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టారు. ఇక సీనియ‌ర్ ఎన్టీఆర్ సేవాత‌త్వం అందిపుచ్చుకున్న జూనియ‌ర్ కూడా త‌న వంతుగా త‌న అభిమానులు ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు ఆదుకోవ‌డంతో పాటు త‌న‌వంతుగా సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు.

6 – డైలాగ్ డెలివ‌రీ :
ఎంత పెద్ద డైలాగ్ అయినా, ఎంత సంక్లిష్ట‌మైన డైలాగ్ అయినా కూడా ఎన్టీఆర్ పొల్లు పోకుండా సింగిల్ టేక్‌లో చెప్ప‌డం అల‌వాటు. ఆ ఎన్టీఆర్ త‌ర్వాత ఆయ‌న త‌న‌యుడు బాల‌య్య‌.. ఇక ఇప్ప‌టి త‌రంలో జూనియ‌ర్ ఎన్టీఆర్ మాత్ర‌మే అంత పెద్ద డైలాగ్‌ల‌ను చెప్ప‌డం విచిత్రం. డైలాగ్ విష‌యంలో తాత‌కు పోటీ ఇచ్చేలా జూనియ‌ర్ డైలాగులు చెపుతుంటారు.

7- తెలుగు భాష‌, సంస్కృతి ప‌ట్ల గౌర‌వం :తెలుగు భాష, సంస్కృతి అంటే సీనియర్ ఎన్టీఆర్‌కు ఎంత గౌర‌వ‌మో చెప్ప‌క్క‌ర్లేదు. ఎన్టీఆర్ తెలుగు భాష ఎంతో చ‌క్క‌గా మాట్లాడ‌తారు. అందుకే తెలుగు భాషా అకాడ‌మీకి ఆయ‌న ఎంతో ప్రాధాన్య‌త ఇచ్చారు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు కూడా తెలుగుపై మంచి ప‌ట్టు ఉంది. జూనియ‌ర్ తెలుగు మాట్లాడుతుంటే ఇంత మ‌ధుర‌మా అన‌కుండా ఉండ‌లేం.

8- రాజ‌కీయ రంగంలో స‌క్సెస్ :
సీనియ‌ర్ ఎన్టీఆర్ సినిమాల్లో నుంచి రాజ‌కీయాల్లోకి వ‌చ్చి పార్టీ పెట్టి ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు వెళ్లి గెలిచి ముఖ్య‌మంత్రి అయ్యారు. జూనియ‌ర్ సైతం తాత స్థాపించిన పార్టీ కోసం 2009లో ప్ర‌చారం చేశాడు. అయితే భ‌విష్య‌త్తులో జూనియ‌ర్ రాజ‌కీయాల్లోకి వ‌స్తే స‌క్సెస్ అవుతార‌న్న భారీ అంచ‌నాలు ఉన్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news