టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ హీరోగా… కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే సినిమా షూటింగ్ ఈ నెల చివరి నుంచి స్టార్ట్ కానుంది. త్రిబుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ ఏకంగా ఆరేడు నెలల నుంచి ఖాళీగానే ఉన్నాడు. కొరటాల డిజాస్టర్ ఆచార్య రిలీజ్ అయ్యి కూడా ఆరు నెలలు దాటేసింది. కానీ ఇప్పటకీ ఆరేడు నెలలుగా వీరు ఖాళీగా ఉంటున్నా కూడా సినిమా షూటింగ్ ఎందుకు స్టార్ట్ కావడం లేదు ? అన్న డౌట్ అందరిని వెంటాడుతోంది.
కేవలం ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల ఓ డిఫెన్స్‌లో పడ్డాడు. ఎలాగైనా ఎన్టీఆర్ సినిమాతో హిట్ కొట్టి.. అసలు తానేంటో ఫ్రూవ్ చేసుకోవాలన్న పట్టుదలతో ఉన్నాడు. అందుకే ఈ సినిమా ఇంకా లేట్ అవుతూ వస్తోంది. ఇక పాన్ ఇండియా లెవల్లో వస్తుండడంతో హీరోయిన్‌తో పాటు కాస్ట్యూమ్స్, నటీనటులు, టెక్నికల్ టీం విషయంలోనూ కొరటాల ఎక్కడా రాజీపడడం లేదు.
ఇక ఈ సినిమా గురించి మరో మైండ్ బ్లాకింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమా మైథలాజికల్ టచ్ నేపథ్యంలో నడుస్తుందట. హిందూ పురాణాల్లోని 18 మహా పురాణాల్లో గరుడ పురాణం కూడా ఒకటి. ఇది వైష్ణవ సాహిత్యం కార్పస్‌లోని ఓ పార్ట్‌గా ఉంటుంది. ఇక గరుడ పురాణంలోని ఓ పాయింట్‌ను బేస్ చేసుకుని కొరటాల ఈ కథ డెవపల్ చేసుకున్నాడని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంటుందని ముందు నుంచి టాక్ నడుస్తోంది. ఈ పాత్ర కోసమే ఎన్టీఆర్ ఏకంగా 8 – 9 కిలోల బరువు కూడా తగ్గాడు. ఏదేమైనా సినిమా లేట్ అవుతోన్న కొద్ది ఈ క్రేజీ కాంబోపై క్యూరియాసిటీ అయితే పెరుగుతోంది. గతంలో ఎన్టీఆర్ – కొరటాల కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అవ్వడంతో ఖచ్చితంగా ఈ సినిమా కూడా సంచలనాలు క్రియేట్ చేస్తుందనే తారక్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.