నందమూరి బాలకృష్ణ నాలుగు దశాబ్దాలుగా సినిమాలలో కొనసాగుతున్నా ఇప్పటికీ ఆయన క్రేజ్ తగ్గలేదు. యాక్షన్ సినిమాలకు బాలయ్య కేరాఫ్ అడ్రస్. ఇంకా చెప్పాలంటే బాలయ్య మాస్ ప్రేక్షకులకు దేవుడు. బాలయ్య చెప్పే ప్రతి డైలాగ్ కూడా ప్రేక్షకులకు పూనకాలు తెప్పిస్తూ ఉంటుంది. బాలయ్య చెప్పే పవర్ఫుల్ డైలాగులకు థియేటర్లలో ఈలలు, కేకలు పడాల్సిందే. ఆరు పదుల వయసు దాటేసిన బాలయ్య జోష్ ఏ మాత్రం తగ్గలేదు. తాజాగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ సినిమాతో బాలయ్య తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు.
ఇప్పటివరకు బాలయ్య కెరీర్లో ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర తిరుగులేని రికార్డులు క్రియేట్ చేశాయి. బాలయ్య నటించిన నరసింహనాయుడు సినిమా 105 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. భారతదేశ సినీ చరిత్రలో ఓ హీరో నటించిన సినిమా 100 కేంద్రాల్లో 100 రోజులు ఆడటం అదే ఫస్ట్ టైం. ఈ అరుదైన రికార్డు తొలిసారిగా బాలయ్య పేరిట లిఖించబడింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఊర్లు, కొన్ని ప్రాంతాలు బాలయ్య సినిమాలకు కంచుకోటగా ఉంటూ వస్తున్నాయి.
రాయలసీమ ఏరియాలో బాలయ్యకు విపరీతంగా అభిమానులు ఉంటారు. బాలయ్య సినిమాలో అక్కడ రికార్డుల మీద రికార్డులు బద్దలు కొడుతూ ఉంటాయి. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సీడెడ్ లో ఎన్నో చోట్ల శత దినోత్సవాలు, ద్విశత దినోత్సవాలు జరుపుకున్నాయి. ఎమ్మిగనూరు – కోవెలకుంట్ల – నంద్యాల – ప్రొద్దుటూరు – హిందూపురం – ఆదోని లాంటి సెంటర్లు బాలయ్యకు మంచి పట్టున్న ప్రాంతాలు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట కూడా బాలయ్య సినిమాలకు కంచుకోటే. ఈ పట్టణాల్లో బాలయ్య యావరేజ్, బిలో యావరేజ్, ప్లాప్ సినిమాలు సైతం సెంచరీలు ఆడేశాయి.
ఇక బాలయ్య లెజెండ్ అయితే ఎమ్మిగనూరు, ప్రొద్దుటూరులో ఏకంగా 400 రోజులు ఆడింది. ప్రొద్దుటూరులో అయితే లెజెండ్ 1005 రోజులు ఆడి సరికొత్త టాలీవుడ్ రికార్డు క్రియేట్ చేసింది. ఇక సీడెడ్‌లో బాలయ్య డిక్టేటర్, జై సింహా, అఖండ, గౌతమీపుత్ర శాతకర్ణి లాంటి సినిమాలు కూడా సెంచరీలు కొట్టేశాయి. ఎమ్మిగనూరు టౌన్‌లో అయితే బాలయ్య సినిమాలు ప్లాప్ అయినా వంద ఆడినవి ఎన్నో ఉన్నాయి. ఏదేమైనా సీడెడ్‌లో పలు ప్రాంతాలు బాలయ్య సినిమాలకు కంచుకోటలే..!