టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమా కోసం ఫ్యాన్స్ ఆరేడు నెలలుగా ఎంతో ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నారు. త్రిబుల్ వచ్చి ఏడు నెలలు అవుతోంది. కొరటాల ఇంకా తన ప్రాజెక్టును మాత్రం సెట్స్ మీదకు తీసుకు వెళ్లడం లేదు. ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకు వెళ్లేందుకు ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆచార్య డిజాస్టర్ తర్వాత కొరటాలపై తీవ్ర విమర్శలు రావడమే. దీంతో కొరటాల కథ నుంచి, డైలాగులు, చివరకు హీరోయిన్ వరకు ఏ విషయంలోనూ రాజీపడడం లేదు.
పైగా చిరంజీవి కంటిన్యూగా విమర్శలు తనను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయ్. అందుకే ఎన్టీఆర్ కోసం చాలా పవర్ ఫుల్ కథను రెడీ చేసుకుంటున్నాడు. ఇక త్రిబుల్ ఆర్ లాంటి భారీ పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక ఎన్టీఆర్ చేస్తోన్న సినిమా కావడంతో ఈ క్రేజీ ప్రాజెక్టుపై పాన్ ఇండియా లెవల్లోనే అంచనాలు ఉన్నాయి. అందుకే హీరోయిన్ విషయంలోనూ కొరటాల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇక హీరోయిన్గా అలియాభట్, జాన్వీకపూర్ ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. ఎవ్వరూ ఫైనల్ కాలేదు. చివరకు కొరటాల మహానటి ఫేం, మహేష్‌బాబు సర్కారువారి పాట సినిమాలో నటించిన కీర్తి సురేష్‌ను కూడా సంప్రదించినట్టు తెలుస్తోంది. కీర్తికి సరైన ఛాన్సులు పడడం లేదు. ఆమె ఎక్కువుగా ఓటీటీ సినిమాలు చేయడంతో ప్రేక్షకుల్లో ఎందుకో ఆమె పట్ల పెద్దగా క్రేజ్ లేదనే చెప్పాలి.
ముందు కీర్తిని సంప్రదించాక కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో ఆమె మైనస్ అవుతుందా ? అన్న డౌట్‌తోనే మళ్లీ పక్కన పెట్టేశారనే అంటున్నారు. దీంతో ఈ ప్రాజెక్టులో ఎన్టీఆర్‌కు జోడీగా నటించే ఆ ముద్దుగుమ్మ ఎవరు ? అన్నదానిపై ఇప్పుడు ఒక్కటే చర్చలు నడుస్తున్నాయి. యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థుల సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఇస్తున్నారు.