ఎన్టీఆర్ జీవితంలో అనేక మరపురాని ఘట్టాలు ఉన్నాయి. తను ప్రయోగం చేసి, దర్శకత్వం వహించిన సినిమాలు హిట్ కావడం.. ఒకటైతే.. దీనికి మించి..తన వారసుడుగా.. బాలయ్య హిట్ కావడం.. మరో మర పురాని ఘట్టంగా అన్నగారు పేర్కొన్నారు. అయితే.. దీనికి మించి.. అన్నగారికి.. శాస్త్రంపైనా.. హిందూ ఆచారాలపైనా ఎనలేని మక్కువ. దీంతో ఆయన తిరుపతి వెంకట కవులను తరచుగా కలుసుకునే వారు. తన ప్రభుత్వంలో వారిని ఆస్థాన విద్వాంసులుగా కూడా నియమించారు.
ఈ క్రమంలో హిందూ సంప్రదాయంలో అన్నగారు వివాహాలు చేయించడం కూడా నేర్చుకున్నారు. పూర్తి సంప్రదాయ బద్ధంగా అన్నగారు.. వివాహాలు చేయించడంలో దిట్టగా మారారు. దీనికి గాను అన్నగారు చాలానే కృషి చేశారు. ఈ క్రమంలో మరి అన్నగారు వివాహం చేయించడం అయితే నేర్చుకున్నారు కానీ .. అన్నగారిని పిలిచి వివాహం చేయించుకునే వారు ఎవరు ? ఈ విషయం అలా మిగిలిపోయింది. అయితే.. అన్నగారి మనసు తెలిసిన..యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ చిన్న ప్రయత్నం చేశారు.
టీడీపీలో కొత్తగా చేరిన మోహన్‌రెడ్డి అప్పుడే తన కుమార్తె వివాహానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం.. యార్లగడ్డకు తెలిసింది. వెంటనే ఆయన.. ఖర్చు అంతా కూడా తానే భరిస్తానని.. చెప్పి.. దీనికి ఒక కండిషన్ పెట్టారట. అన్నగారు వివాహ సంప్రదాయాన్ని ఔపోసన పట్టారని..ఆయనతో నీ కుమార్తె వివాహం చేయించు.. అంతా బాగుంటుందని సలహా ఇచ్చారు.
ఇలా.. తొలి సారి.. మోహన్‌రెడ్డి కుమార్తె వివాహానికి అన్నగారు స్వయంగా మంత్రాలు చదివి మరీ.. వివాహం చేయించారట. తర్వాత.. మరికొందరు వచ్చినా..అన్నగారు బిజీకావడంతో ఇక, ఆ తర్వాత ఎవరి వివాహాన్ని చేయించలేదు. ఇదే తొలి, చివరిది కావడం గమనార్హం. అందుకే.. ఈ ఘట్ట.. అన్నగారి జీవితంలో మరపు రాని ఘట్టంగా మిగిలిపోయిందని అంటారు.