Movies48 ఏళ్ల న‌ట జీవితంలో బాల‌య్య గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని 10...

48 ఏళ్ల న‌ట జీవితంలో బాల‌య్య గురించి ఎవ్వ‌రికి తెలియ‌ని 10 ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు..!

నందమూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ త‌న తండ్రి ఎన్టీఆర్ న‌ట వార‌స‌త్వాన్ని అంది పుచ్చుకుని సినిమాల్లోకి వ‌చ్చారు. త‌న తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన తాత‌మ్మ క‌ల సినిమాతో కేవ‌లం 14 ఏళ్ల‌కే వెండితెర‌పై క‌నిపించాడు. ప్ర‌స్తుతం బాల‌య్య వ‌య‌స్సు 62 ఏళ్లు. అయితే న‌టుడిగా ఆయ‌న ఏకంగా 48 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. బాల‌య్య ఇన్నేళ్ల న‌ట జీవితంలో కొన్ని ఇంట్ర‌స్టింగ్ విష‌యాలు తెలుసుకుందాం.

1- బాల‌య్య 1974 – 2022 మ‌ధ్య‌లో 48 ఏళ్ల పాటు న‌టుడిగా కొన‌సాగుతున్నారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ జ‌న‌రేష‌న్ త‌ర్వాత జ‌న‌రేష‌న్ల‌లో ఇన్నేళ్ల పాటు ఏ హీరో కూడా న‌టుడిగా 48 సంవ‌త్స‌రాలు కొన‌సాగ‌లేదు. మ‌రో రెండేళ్లు పూర్త‌యితే న‌టుడిగానే బాల‌య్య కెరీర్ 5 ద‌శాబ్దాలు పూర్తి చేసుకున్న‌ట్టు అవుతుంది. ఇది ఇప్ప‌ట్లో చెరిగే రికార్డు కాదు.
2- బాల‌య్య ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్‌లో 106 సినిమాల్లో న‌టించారు. మ‌లినేని గోపీ ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న 107వ సినిమా వ‌స్తోంది. 108వ సినిమా కూడా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో ఫిక్స్ అయ్యింది.
3- బాల‌య్య ఇప్ప‌టి వ‌ర‌కు త‌న కెరీర్ మొత్తంలో 126 మంది హీరోయిన్ల‌తో న‌టించారు. ఇండియాలో లీడింగ్ రోల్స్ చేసిన హీరో ఇంత మంది హీరోయిన్ల‌తో న‌టించిన రికార్డు బాల‌య్య‌కే సొంత‌మైంది.

4- బాల‌య్య సినిమాల్లో రు.10 ల‌క్ష‌లు వ‌సూలు చేసిన సినిమాలు ఉన్నాయి. ఏకంగా రు. 200 కోట్లు రాబ‌ట్టిన సినిమాలు ఉన్నాయి. బాల‌య్య చివ‌ర‌గా చేసిన అఖండ ఏకంగా రు. 200 కోట్లు రాబ‌ట్టింది. బాల‌య్య కెరీర్‌లో క‌మ‌ర్షియ‌ల్‌, వ‌సూళ్ల ప‌రంగా అఖండ‌దే టాప్ రికార్డు.
5- బాల‌య్య‌కు అభిమానులు పెట్టిన క‌టౌట్స్‌లో 10 ఫీట్ల క‌టౌట్ల నుంచి 108 ఫీట్స్ క‌టౌట్ల వ‌ర‌కు ఉన్నాయి. ఈ 108 ఫీట్ల క‌టౌట్ స్టిల్ రికార్డు.
6- బాల‌య్య సినిమాల్లో 100 రోజులు ఆడిన సినిమాల నుంచి 1000 రోజులు ఆడిన సినిమాల వ‌ర‌కు ఉన్నాయి. బాల‌య్య ఎన్నో సినిమాల‌తో సెంచ‌రీలు కొట్టాడు. అలాగే లెజెండ్ సినిమా అయితే ఏకంగా 1000 రోజులు ఆడింది. ఇది భార‌త‌దేశ సినీ చ‌రిత్ర‌లో స‌రికొత్త రికార్డుగా నిలిచింది.

7- త‌న తండ్రి ఎన్టీఆర్ తో క‌లిసి మొత్తం 12 సినిమాల్లో న‌టించిన బాల‌య్య తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో మొత్తం 6 సినిమాల్లో న‌టించారు.
8- బాల‌య్య హీరో అయ్యాక ఎన్టీఆర్ దర్శకత్వంలో శ్రీ మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర, బ్రహ్మర్షి విశ్వామిత్రా సినిమాల్లో న‌టించారు.

9- 48 ఏళ్ల త‌న న‌ట ప్ర‌స్థానంలో బాల‌య్య సాంఘిక, జానపద, పౌరాణిక,చారిత్రక, సైన్స్ ఫిక్షన్, సోషియో ఫాంటసీ సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు.
10- సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు ఏ. కోదండ రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య అత్య‌ధికంగా 13 సినిమాల్లో న‌టించారు. ఇందులో 9 సూప‌ర్ హిట్ అయితే… 4 ప్లాప్ అయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news