ఇప్పుడంటే సోషల్ మీడియా యుగం. ఏ హీరోయిన్‌కు అయినా లైంగీక వేధింపుల పరంగా, లేదా సినిమా షూటింగ్‌లో ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా మీడియా ముందుకు వచ్చేస్తున్నారు. శ్రీరెడ్డి, తాప్సీ, రాధికా ఆఫ్టే, కస్తూరి, సింగర్ చిన్నయి ఇలా చాలా మంది డేర్‌గా తమ అనుభవాలు పంచేసుకుంటున్నారు. 30 ఏళ్ల క్రితం ఉన్న ఇండస్ట్రీ అంతా హీరోస్వామ్యమే. ఏ హీరోయిన్ అయినా హీరోస్వామ్య ఇండస్ట్రీని ఎదిరించి ముందుకు వెళ్లే పరిస్థితి లేదు. అయినా కూడా ఓ హిట్ హీరోయిన్ ఓ స్టార్ హీరో సినిమాలో తనను ఇబ్బంది పెడుతున్నారని ఆ సినిమాను, ఆ హీరోను లైట్ తీస్కోని తన సినీ కెరీర్‌కే శాశ్వతంగా బైబై చెప్పేసింది.
నాగార్జున – మణిరత్నం కాంబోలో 1989లో వచ్చిన గీతాంజలి సినిమా సూపర్ హిట్. ఈ సినిమాలో హీరోయిన్ గిరిజకు మంచి పేరు వచ్చింది. ఆమె అసలు పేరు గిరిజ ఎమ్మాజెన్ షెత్తార్. తల్లి బ్రిటీషర్.. తండ్రి కన్నడ. ఆమెకు నేషనల్ వైడ్‌గా పాపులారిటీ రావడంతో అమీర్‌ఖాన్ జో జీతా వోయి సికిందర్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అయితే ముందుగా చేసుకున్న కాంట్రాక్ట్‌కు విరుద్ధంగా ఆమెతో దర్శక నిర్మాతలు ఎక్స్‌పోయింగ్ చేయించే ప్రయత్నం చేశారు.
అయితే ఆమె నిర్మాతలతో గొడవ పడి మరీ కోర్టుకు వెళ్లింది. చివరకు ఆమెను సినిమా నుంచి తప్పించేసి అయేషా జుల్కాను తీసుకున్నారు. గిరిజ టోటల్‌గా సినిమాలకే గుడ్ బై చెప్పేసి బ్రిటన్ వెళ్లిపోయి అక్కడ పీహెచ్‌డీ చేసింది. క్రికెటర్ శ్రీకాంత్ సోదరి శ్రీకళ దగ్గర భరతనాట్యం నేర్చుకునే సమయంలో మణిరత్నం – సుహాసిని పెళ్లికి వెళ్లి మణిరత్నం కంట్లో పడడంతో అలా గీతాంజలి సినిమాలో ఛాన్స్ వచ్చింది.
గీతాంజలి తర్వాత వరుస ఆఫర్లు వచ్చాయి. మళయాళంలో చేసిన వందనం మరో సూపర్ హిట్. ఆ తర్వాత హృదయాంజలి సినిమా చేసింది. 1992లోనే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా పదేళ్లు ఆలస్యంగా 2002లో రిలీజ్ చేశారు. సినిమాలకు గుడ్ బై చెప్పాక ఆమె జర్నలిస్టుగా పని చేసింది. ఫిలాసపీ మీద వ్యాసాలు రాసింది. బేసిక్‌గా తన ప్రపంచం వేరు అన్నట్టగా ఉండేది.
ఆమె వయస్సు 53 ఏళ్లు… ఇప్పటకీ పెళ్లి చేసుకోలేదు. అసలు పెళ్లి మీద ఆసక్తే లేదు అంటోంది. అయితే గీతాంజలి సినిమాకు సీక్వెల్ వస్తే అందులో నటిస్తే బాగుంటుందన్న కోరిక మాత్రం చెపుతూ ఉంటుంది. ఆమెకు ఈ ప్రపంచంలో ఇష్టమేన ప్లేసు అరవిందాశ్రమం. అది గిరిజ స్టోరి.