టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత- యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య.. ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరు కలిసి నటించిన సినిమా ఏం మాయ చేసావే.. మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయిన ఇద్దరు ఆ తర్వాత కొంతకాలం గుట్టు చప్పుడు కాకుండా ఆ ప్రేమను కంటిన్యూ చేసి వన్ ఫైన్ డే నాగచైతన్య అక్కినేని నాగార్జునకు మ్యాటర్ మొత్తం చెప్పాడు. దీంతో షాక్ అయిపోయిన నాగార్జున సమంతతో కూడా కన్ఫామ్ చేసుకున్నారు .ఇది నిజంగా ప్రేమేనా..? లేక మరేదైనా నా..? అంటూ ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడి ఆ తర్వాత సమంత పేరెంట్స్ ని పిలిపించి మ్యాటర్ చెప్పారు.
అయితే మొదట సమంత పేరెంట్స్ పెళ్ళికి ఒప్పుకోలేదు. ఇక తర్వాత సమంత ..”మొండి చేసి మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నేను ఈ పెళ్లి చేసుకుంటాను” అని గట్టిగా భీష్ముంచుకుని కూర్చుని ఎట్టకేలకు తను ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. వీళ్ళ పెళ్లి గోవాలో గ్రాండ్గా జరిగింది. అబ్బో ఆ టైంలో ఆటలు పాటలు అల్లరి అంతా ఇంతా కాదు .ఏకంగా సురేష్ బాబు, వెంకటేష్ ,నాగార్జున ,అమల అందరూ కలిసి ధూమ్ ధామ్ అని డాన్స్ చేశారు. దానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అయితే ఎవరు ఊహించని విధంగా నాగచైతన్య సమంత విడాకులు తీసుకొని అభిమానులకు షాక్ ఇచ్చారు. అయితే వీళ్ళు ఎందుకు విడాకులు తీసుకున్నారో ఇప్పటికీ సరైన జవాబు లేదు. మనకు తెలిసిందే పెళ్లి టైం లో సమంత నగలు, చీరలు ఎంత ఫేమస్ అయ్యాయో . అవి అన్ని దగ్గుబాటి వారి వంశస్ధుల నగలే అంటూ అప్పట్లో వైరల్ అయ్యాయి. మరీ ముఖ్యంగా సమంత మెడలో ధరించిన తాళిబొట్టు దగ్గుబాటి లక్ష్మీ వాళ్ళ అమ్మగారు వారసత్వంగా కూతురికి ఇచ్చిన నగలట. అయితే విడాకుల తర్వాత మాత్రం సమంత తన చీరను తనకిచ్చిన నగలను అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసి దగ్గుబాటి ఫ్యామిలీకి హ్యాండ్ ఓవర్ చేసిన్నట్లు తెలుస్తుంది. మరి ముఖ్యంగా సమంత తాళిబొట్టుల్లో ఒకటి దగ్గుబాటి ఫ్యామిలీ ఇచ్చింది .
మరొకటి అమ్మగారు ఇచ్చింది. కాగా సమంత మాత్రం వాళ్ళ అమ్మగారు ఇచ్చిన తాళిబొట్టును గుర్తుగా పక్కకు తీసేసి దగ్గుబాటి ఫ్యామిలీ ఇచ్చిన నగలను చీరలను మొత్తంగా వాళ్ళకి హ్యాండోవర్ చేసిందట. ఏది ఏమైనా ఒక ఆడపిల్లకి తన తాళిబొట్టు తానే తీసే అంత దరిద్రం మరొకటి ఉండదు కదా. ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.