జనరల్ గా ఎవరైనా సరే పెళ్లయిన తర్వాత ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుడ్ న్యూస్ చెప్పాలని ఇంట్లో వాళ్ళ ఆశపడుతూ ఉంటారు.స్టార్ సెలబ్రెటీస్ దగ్గరికి వస్తే వాళ్ళ ఫాన్స్ కూడా ఆశ పడుతూ ఉంటారు .ఎవరైనా హీరో హీరోయిన్ పెళ్లి చేసుకున్న వెంటనే వాళ్ల నుండి గుడ్ న్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తారు. అదే విధంగా నయనతార విషయంలోనూ ఎక్స్పెక్ట్ చేశారు .వీలైనంత త్వరగా తల్లితండ్రులు అవ్వండి మీ ప్రేమను ఎక్స్ టెండ్ చేయండి అంటూ జనాలు చెప్పుకొచ్చారు ఫ్యాన్స్. నయనతార తల్లి అయితే చూడాలని ఎంతో ఆశపడ్డారు. అయితే ఎవ్వరూ ఊహించని విధంగా నయనతార పెళ్లైన నాలుగు నెలలకి ఏకంగా ఇద్దరు కవల పిల్లలకు జన్మనివ్వడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
కొద్దిసేపటి క్రితమే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ విగ్నేష్ శివన్..” నేను నయనతార అమ్మ అప్ప అయ్యాము” అంటూ అఫీషియల్ గా ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా కోలీవుడ్ మీడియా షేక్ అయిపోయింది .
పెళ్లైన నాలుగు నెలలకే బిడ్డలకు జన్మనివ్వడం ఏంటి అంటూ అభిమానులు షాక్ అయిపోతున్నారు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం వీళ్ళిద్దరూ సరోగసి ప్రాసెస్ ద్వారా తల్లిదండ్రులు అయినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే వీళ్ళ పిల్లల పేర్లకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .విగ్నేష్ తన పిల్లల పేర్లు కూడా చెప్పుకొస్తూ (ఉయిర్ , ఉలగం )వాళ్లకు మీ ఆశీర్వాదం కావాలి అంటూ పోస్ట్ చేశాడు. దీంతో వీళ్ళ పేర్లు గురించి సరికొత్త మేటర్ ఇంట్రెస్టింగ్ గా మారింది .
నిజానికి నయనతార విగ్నేష్ పిల్లలకి పేర్లు పెట్టింది కోలీవుడ్ స్టార్ హీరో సూర్య అట. వీళ్ళ పెళ్లి టైం లో సూర్య జ్యోతిక ఎంత హడావిడి చేశారో మనకు తెలిసిందే. వీళ్ళకి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ఇదే క్రమంలో త్వరగా పిల్లల్ని కనండి అంటూ ఆశీర్వదించి సరదాగా ఆ సంభాషణ కాస్త పిల్లల పేర్లు పెట్టే వరకు వెళ్లిందట. ఇదే క్రమంలో సూర్య కు ట్వీన్స్ అంటే ఇష్టమని..మీకు ట్విన్స్ నే పుట్టాలి అని బ్లెస్ చేసాడట. ఈ క్రమంలోనే ట్వీన్స్ పుడితే ఉయిర్ , ఉలగం అంటూ పేరు పెట్టుకోండి అని ఆనాడే నామకరణం చేశారట . ఇక ఆయన గుర్తుగానే విగ్నేష్ అలా నామకరణం చేశారట. కాగా ఉయిర్ అంటే అర్ధం.. ఉలగం అంటే ప్రపంచం అని అర్థం . దీంతో వీళ్ళ పేర్లు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి .