టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మరో పెళ్లి భాజా మోగింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా ఉన్నటువంటి గుణశేఖర్ కూతురు నీలిమ త్వరలోనే పెళ్లి చేసుకుని ఓ ఇంటికి కోడలుగా వెళ్లబోతుంది. ఇదే విషయాన్ని అఫీషియల్ గా ప్రకటించారు గుణశేఖర్ అండ్ ఫ్యామిలీ. అయితే ఎంగేజ్మెంట్ జరిగే వరకు ఈ విషయం బయట పెట్టకపోవడం సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. మనకు తెలిసిందే సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ గుణశేఖర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి. ఇప్పుడంటే పెద్దగా ఆయన్ని పట్టించుకునే జనాలు లేరు . కానీ ఒకప్పుడు ఆయన అంటే మంచి క్రేజ్ ఉండేది .
కాగా పాపులారిటీ లేకపోయినా.. ఫామ్ లో లేకపోయినా కానీ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఆయనకు అవకాశం ఇచ్చింది. “శాకుంతలం” సినిమా లో ఆమె నటించింది . ఈ సినిమాను డైరెక్ట్ చేసింది గుణశేఖర్ .ప్రొడ్యూసర్ గా ఉండింది నీలిమ గుణశేఖర్. ఇప్పుడు పెళ్లి చేసుకోబోతుంది ఆమె. అయితే నిన్న సాయంత్రం హైదరాబాద్లో ఈమె నిశ్చితార్ధ వేడుకలు ఘనంగా జరిగాయి. దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి . అంతేకాదు స్వయంగా నీలిమానే ట్విట్ చేస్తూ “నా జీవితకాల ప్రయాణం మొదలైంది ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది . అయితే నీలిమ గుణ శేఖర్ భర్త చూడటానికి అందంగా ఉండడంతో.. రాయల్ లుక్ లో కనిపించడంతో ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ గురించి సెర్చ్ చేస్తున్నారు జనాలు.
ఈ క్రమంలోనే ఆయన గురించి షాకింగ్ మ్యాటర్ బయటపడింది వీళ్ళ ది లవ్ మ్యారేజ్ గా తెలుస్తుంది . అంతేకాదు గుణశేఖర్ కాబోయే అల్లుడు రవి ప్రక్యాకి కోట్ల కట్నం ఇస్తున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందుతుంది. కాగా రవి ప్రక్యవిదేశాలలలో చదువుకుని బిజినెస్ లో మంచి పట్టు సాధించాడట. ఎలాంటి బిజినెస్ స్ట్రాటజీస్ అయినా అమలు చేయడంలో రవిప్రక్యా తర్వాతనే ఎవరైనా అంటూ ఓ న్యూస్ వినిపిస్తుంది . అంతేకాదు రవి ప్రక్యాకి మ్యూజిక్ కంటే చాలా ఇష్టమట. ఎటువంటు సంగీతం ప్రాక్టీస్ తీసుకోకపోయినా కానీ రవిప్రక్యాకు సొంతంగా పాటలు పాడే అలవాటు ఉందట. ఈయన పాట పాడితే ఎలాంటి వ్యక్తి అయినా సరే ఆ బాధ నుంచి బయటకు వచ్చేస్తారట . అంత హాయిగా ఉంటుందట ఈయన పాట వింటుంటే . ప్రజెంట్ ఇదే న్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఓ పక్క బిజినెస్ మరోపక్క రిలాక్స్ అన్నింట్లోనూ ఫుల్ టాలెంట్ ఉన్న అల్లుడినే పట్టేసాడు శేఖర్ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.