News అయ్య బాబోయి.. లైవ్ లోనే నదిలో దూకేసిన హీరోయిన్!!

అయ్య బాబోయి.. లైవ్ లోనే నదిలో దూకేసిన హీరోయిన్!!

బ్రేకప్ అవడం.. పెళ్లి పెటాకులు కావడం.. విడాకులు తీసుకోవాల్సి రావడం.. అత్తారింటి నుంచి ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావడం లాంటి పరిస్థితులు హీరోయిన్ కే కాదు.. ఏ అమ్మాయిపై అయినా బాగా ఎఫెక్ట్ చూపిస్తాయి. కానీ అమలా పాల్ మాత్రం ఇలాంటివేమీ పట్టించుకోకుండా.. ఫారిన్ టూర్ పెట్టుకుని మరీ ఎంజాయ్ చేసేస్తోంది. లైఫ్ లో వచ్చిన డిస్టర్బెన్సులను పట్టించుకోకుండా ఇలా ఎంజాయ్ చేయగలగడం అందరికీ సాధ్యం కాదు. కానీ అమలాపాల్ మాత్రం ఇండనేషియా బాలిలో తన బర్త్ డే సెలబ్రేట్ చేసుకుటోంది.

అయుంగ్ నది.. పెద్దగా లోతు లేకపోయినా.. దట్టమైన అడవికి పక్కనే ఉండడంతో కాసింత భయం గొలిపించడం ఖాయం. ఓ ఉయ్యాల కట్టుకుని ఊగుతూ దానిపై నుంచి నదిలోకి దూకేయడం అందుకు చాలా డేరింగ్ కావాలి. థ్రిల్ తో పాటు ఎంజాయ్ మెంట్ ను కూడా ఇచ్చే ఈ ఫీట్ ను తెగ ఉత్సాహంగా చేసేస్తున్న అమలాపాల్.. దాన్ని ఓ చిన్న వీడియో కూడా చేసి.. సోషల్ మీడియాలో షేర్ చేసింది.

‘హ్యాపీ బర్త్ డే టు మీ’ అంటూ తనకు తనే విషెస్ కూడా చెప్పేసుకుంటూ అమల పెట్టిన పోస్ట్ చూస్తుంటే.. ఏ రేంజ్ హ్యాపీనెస్ ఫీలవుతోందో అర్ధం చేసుకోవచ్చు. అవునూ.. ఈ హ్యాపీనెస్ అంతా కేవలం బాలిలో ఎంజాయ్ చేస్తున్నందుకే అంటారా? వేరే ఏదైనా రీజన్ కూడా ఉందా?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news