“రామారావ్‌ని కలిశావా.. ఏమన్నాడు!“-ఇదీ.. అగ్ర దర్శకుడు కేవీ రెడ్డి.. తన అసిస్టెంట్, తర్వాత కాలంలో హీరోగా నటించిన కస్తూరి శివరావును ఉద్దేశించి.. చేసిన వ్యాఖ్య. దీనికి ఆయన నీళ్లు నమిలాడు. `రామారా వ్ బిజీగా ఉన్నాడని తెలిసింది!` అన్నాడు. దీంతో ఉన్నాడా.. ఉంటాడా? నేను చెప్పిన తర్వాత.. కూడా అలానే అన్నాడా? అని ఎదురు ప్రశ్నించారట. ఎన్టీఆర్‌పై ఆయన కాస్త అసహనం కూడా వ్యక్తం చేశారట. ఇక, లాభం లేదని అనుకుని.. తనే స్వయంగా.. అన్నగారి రూంకు వచ్చారట కేవీ రెడ్డి.
ఒక అగ్రదర్శకుడు.. తన రూంకు రావడంతో.. అన్నగారు హతాశులయ్యారు. “అయ్యా.. తమరు స్వయంగా రావడం ఏంటి? కాకితో కబురు పెడితే..రెక్కలు కట్టుకుని వాలకపోతానా?“ అన్నారట. రానన్నావట.. శివరావ్ చెప్పాడు.. అని కేవీ రెడ్డి అనడంతో.. అన్నగారు నిర్ఘాంత పోయారు. శివరావ్ తనను కలవనేలేద ని.. చెప్పాడట. కట్ చేస్తే.. పాతాళ భైరవి మూవీ.. షూటింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా.. శివరావ్ కూడా వచ్చారు. వెంటనే రెడ్డిగారు..ఏంటి శివరావ్.. నువ్వే హీరో వేషం వేయాలనుకున్నావా? అని ప్రశ్నించారట.
విషయం అర్థమైన శివరావ్(అంటే.. ఎన్టీఆర్ కాదంటే.. పాతాళ భైరవిలో శివరావ్ నటించాలని అనుకున్నా రు).. మౌనం వహించారట. అప్పుడు కేవీ రెడ్డి జోక్యం చేసుకుని.. “చూడు శివరావ్.. కొన్ని కొన్ని కొందరితోనే చేయించాలి. నీతోనే.. రెండు సినిమాలు చేశాను. అప్పుడు.. నీకు సంతోషం వేసింది. దీనిని రామారావ్‌తోనే చేయించాలని.. కథను రెడీ చేసుకున్నాం. ఆయన కాదంటే.. మాత్రం నీకు వస్తుందని ఎలా అనుకున్నావ్“ అని ఎదురు ప్రశ్నించారట.
అంతేకాదు.. “రామారావ్ కాదంటే.. కథను ఆపేసేవాడిని.. షూటింగ్ ఉండేది కూడా కాదు.“ అని చెప్పేసరికి.. కేవీరెడ్డి.. దర్శక ప్రతిభ.. ఆయన దూర దృష్టిని.. స్వయంగా వీక్షించిన ఎన్టీఆర్.. ఆశ్చర్యపోయారట. ఇక, ఆ తర్వాత.. కేవీ రెడ్డి తీసిన సినిమాల్లో ఎక్కువ భాగం.. శివరావ్‌తోనే చేయడం గమనార్హం.