Moviesమీరు చెప్పండి..వాడు అసలు మనిషేనా..? పూరిని కెలికిన బండ్ల గణేష్..!!

మీరు చెప్పండి..వాడు అసలు మనిషేనా..? పూరిని కెలికిన బండ్ల గణేష్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ నటుడిని మరో స్టార్ నటుడు దూషించుకోవడం చాలా సర్వసాధారణం అయిపోతుంది. సినిమా ప్రమోషన్స్ కోసం కావచ్చు తమ వ్యక్తిగత పాపులారిటీ కోసం కావచ్చు ఏదైనా సరే స్టార్ హీరోలని స్టార్ డైరెక్టర్లను కొందరు ప్రొడ్యూసర్ కొందరు నటులు విమర్శించడం ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది . అంతేకాదు ఈ లిస్టులో ముందు వరుసలో ఉంటాడు బండ్ల గణేష్.

బండ్ల గణేష్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కమెడియన్ గా సినీ ఇండస్ట్రీ లోకి ఎంటర్ అయి ఆ తర్వాత తన సొంత టాలెంట్ తో సినిమాలు నిర్మిస్తూ బిగ్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నాడు . అంతేకాదు ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం నోటికి వచ్చినట్లు ఎంత మాటైనా అనేయడం బండ్ల గణేష్ స్పెషాలిటీ అంటూ చెప్పుకోస్తారు జనాలు. మనకు తెలిసిందే ఈ మధ్యకాలంలో బండ్ల గణేష్ ఎక్కువగా డైరెక్టర్ పూరి జగన్నాధ్ ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. న్ రీజన్ ఏంటో తెలియదు కానీ బండ్ల గణేష్ కు పూరి జగన్నాథ్ అంటే అస్సలు గిట్టడం లేదు. ఈ క్రమంలోనే ఆకాష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వెళ్లి నోటికొచ్చినట్లు మాట్లాడాడు . ఈ వివాదం గురించి మనకు తెలిసిందే. కాగా రీసెంట్ గా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ మాట్లాడిన తీరు ఇప్పుడు ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది.

సదరు ఛానల్ ఇంటర్వ్యూ ప్రోమో ని రిలీజ్ చేశారు . ఈ క్రమంలోనే బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పరోక్షంగా పూరి జగన్నాథ్ పై కౌంటర్ వేసినట్టు తెలుస్తుంది. సదురు యాంకర్ బండ్ల గణేష్ తో ఎక్కువగా వివాదాస్పద కంటెంట్ కి ఇంట్రెస్ట్ చూపించే విధంగా మాట్లాడారు. దీంతో బండ్ల గణేష్ యాంకర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. అంతేకాదు యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ..” భార్యని ప్రేమించిన వాడు అసలు మనిషేనా “అంటూ ఘాటుగా స్పందించారు. అంతేకాదు ఈ ఇంటర్వ్యూలో పలు వివాదస్పదమైన అంశాలకు బండ్ల గణేష్ క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఇది ఇంటర్వ్యూ కు సంబంధించిన ప్రోమో మాత్రమే మరి పూర్తి ఇంటర్వ్యూ టెలికాస్ట్ అయితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలో బండ్ల గణేష్ అంటూ ఫ్యాన్స్ భయపడిపోతున్నారు. అసలు పూరి జగన్నాథ్ అంటే బండ్ల గణేష్ కు ఎందుకు ఇంత కోపం అంటూ నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. మరి చూడాలి పూరి బండ్ల కామెంట్స్ పై పూరి జగన్నాథ్ ఏ విధంగా స్పందిస్తారో. ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో బండ్ల గణేష్ నోటి దూకుడు ఎక్కువైంది అంటున్నారు సినీ ఇండస్ట్రీలో ఉండే జనాలు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news