పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు 2008లో వచ్చిన `జల్సా` సినిమా తర్వాత చాలా రోజులు పాటు సరియైన హిట్ లేదు. మధ్యలో అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు యువరాజ్యం అధ్యక్షుడు హోదాలో రాజకీయాల్లోకి వెళ్లారు. `జల్సా` తర్వాత ఏకంగా రెండున్నర సంవత్సరాలు పాటు లాంగ్ గ్యాప్ తీసుకున్నారు. ఆ తర్వాత చేసిన `కొమరం పులి`, `పంజా` తీన్మార్ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. పవన్ అభిమానులు కూడా బాగా నిరుత్సాహంలో ఉన్నారు. అలాంటి సమయంలో హరీశంకర్ దర్శకత్వంలో వచ్చిన `గబ్బర్ సింగ్` సినిమా సూపర్ హిట్ అయ్యి పవన్ అభిమానుల్లో ఎక్కడా ఉత్సాహం నింపింది.
`గబ్బర్ సింగ్` సినిమా వచ్చిన వెంటనే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన `అత్తారింటికి దారేది` సినిమాతో టాలీవుడ్ రికార్డులకు చెక్ పెట్టేశాడు. ఇది పవన్ కళ్యాణ్ సినిమా అని పవన్ అభిమానులు గర్వంగా చెప్పుకునేంత సినిమాగా `అత్తారింటికి దారేది` నిలిచింది. పైగా రిలీజ్ ముందు ఈ సినిమాను ఎన్నో కష్టాలు వెంటాడాయి. సినిమా ఆన్లైన్లో ముందే లీక్ అయిపోయింది. పవన్ కూడా ఎంతో భావోద్వేగానికి గురయ్యాడు. `అత్తారింటికి దారేది` సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇక్కడ చూద్దాం.
1- ఈ సినిమాలో హంసానందిని “ఇట్స్ టైం టు పార్టీ నౌ“ అనే ఐటమ్ సాంగ్‌లో స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా ఈ ఆఫర్ హాట్ యాంకర్ అనసూయకి వెళ్ళింది. అనసూయ ఈ ఐటెం సాంగ్ ఆఫర్ రిజెక్ట్ చేయడంతో తర్వాత హంసానందినిని ఫిక్స్ చేశారు.
2- అలాగే `ఖుషి` సినిమాలో “గజ్జె ఘల్లు మన్నాదిరో“ ఐటెం సాంగ్ లో డ్యాన్స్ చేసిన ముంతాజ్ ను 12 ఏళ్ల తర్వాత తీసుకువచ్చి మళ్లీ ఈ ఐటెం సాంగ్ లో స్టెప్పులు వేయించారు.
3- ఈ సినిమా కథను త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ కు ఫోన్ లో చెప్పారు. కథ విన్న వెంటనే పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమాకు హీరోగా ముందు విక్టరీ వెంకటేష్ ను అనుకున్నారు. వెంకటేష్ ఈ క్యారెక్టర్ రిజెక్ట్ చేయడంతో తర్వాత ఈ ఆఫర్ పవన్ కు వచ్చింది.
4- పవన్ కు జోడిగా హీరోయిన్గా ముందు ఇలియానాను అనుకున్నారు. అప్పటికే ఇలియానా పవన్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన `జల్సా` సినిమాలో నటించింది. ఇలియానా డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో ఆ స్థానంలో సమంతను తీసుకున్నారు. సెకండ్ హీరోయిన్ గా ప్రణీత ఎంపికైంది.
5- ఈ సినిమాలో కొంత భాగం స్పెయిన్ లో షూట్ చేశారు. స్పెయిన్ లొకేషన్లను పవన్ స్వయంగా వెతికి వచ్చారు. అక్కడ 45 రోజులు పాటు షూటింగ్ జరిగింది.
6- ఈ సినిమాలో నదియా – పవన్ కళ్యాణ్ మధ్య ఉండే సీన్‌కు పవన్ స్వయంగా దర్శకత్వం వహించారు. 7- `అత్తారింటికి దారేది` సినిమాకు అవార్డుల పంట పండింది. 2003లో ఈ సినిమాకు నాలుగు ఫిలింఫేర్ అవార్డులు వచ్చాయి. అలాగే ఆరు సైమా అవార్డులు సైతం ఈ సినిమా సొంతం చేసుకుంది.
8- ఈ సినిమా టీజర్, ట్రైలర్లకు అప్పట్లో అత్యధిక వ్యూస్‌తో పాటు లైకులు రావటం టాలీవుడ్ లో సరికొత్త రికార్డుగా నిలిచింది.
9- కలెక్షన్ల పరంగా కూడా ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న `అత్తారింటికి దారేది` ఓవరాల్ గా 187 కోట్ల గ్రాస్ కొల్లగొట్టింది. 90 కోట్ల షేర్ రాబట్టింది.
10- సెప్టెంబరు 27, 2013న విడుదలైన ఈ సినిమా 170 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకుంది. 36 కేంద్రాలలో వంద రోజులు ఆడింది.