సినీ ఇండస్ట్రీలో మహానటి సావిత్రి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే . అలాంటి ఓ చెరగని స్థాయిని తనపై ముద్రించుకుంది ఈ మహానటి. అయితే సావిత్రి సినీ కెరియర్ పరంగా ఎంత సక్సెస్ అయిందో వ్యక్తిగతంగా అంత ఫెయిల్యూర్ అయింది అని అందరికీ తెలిసిన విషయమే. సినిమాలో మంచి పొజిషన్ ఉన్న టైంలోనే జెమిని గణేషన్ ను పెళ్లి చేసుకుని తన కెరియర్ పతనానికి మొదటి స్టెప్ వేసింది. ఆ టైంలో అందరూ సావిత్రిని వార్న్ చేశారట .
“రెండో పెళ్లి చేసుకునే కర్మ నీకేంటి.. నీ పొజిషన్ ఏంటి.. నీ స్థాయి ఏంటి..” అంటూ చెప్పుకోచ్చారట. అయినా కానీ ప్రేమ అనే మత్తులో సావిత్రి ఏం చేస్తుందో ఎలా చేస్తుందో తెలియకుండా తన కెరియర్ ని.. తానే సర్వనాశనం చేసుకుందని అప్పటి జనాలు చెప్పుకొచ్చేవారు. అయితే అప్పటి కాలానికి సినీనటి సావిత్రి ఎలా తప్పుటడుగులు వేసిందో.. ఈ కాలానికి కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా అలాగే తప్పటడుగులు వేస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు జనాలు.
మనకు తెలిసిందే కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఈమధ్యనే కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొంతకాలం డేటింగ్ చేసుకున్న ఈ జంట ఆ తర్వాత ఇంట్లో పెద్దలను ఒప్పించి మహాబలిపురంలోని ఓ రిసార్ట్ లో గ్రాండ్ వెడ్డింగ్ చేసుకుంది . అంతేకాదు ఇప్పటికే రెండు హనీమూన్లు కంప్లీట్ చేసుకున్న ఈ జంట మూడో హనీమూన్ కు సర్వం సిద్ధం చేసుకుంది. అయితే తాజాగా నయనతార గురించి కోలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది . ఇప్పటివరకు తను సంపాదించిన ఆస్తి మొత్తాన్ని అమ్మ పేరిట సగం భర్త పేరిట సగం రాయడానికి నిర్ణయించుకుందట .నయనతార తన లైఫ్ లో ఇంపార్టెంట్ వ్యక్తులు ఇద్దరే అంటూ జన్మనిచ్చిన అమ్మ తోడు ఉండబోయే భర్త అని నయనతార ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.
అఫ్కోర్స్ ఈ రోజుల్లో పెళ్లి బంధాలు ఎలా ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. పెళ్లి చేసిన పక్క రోజు డైవర్స్ తీసుకుంటున్న కాలం ఇది. మరి ఇలాంటి టైం లో నయనతార ఆస్తి మొత్తం భర్త పేరు మీద రాయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ అభిమానుల మండిపడుతున్నారు. నయన ఈ నిర్ణయాని వెనక్కి తీసుకుంటే మంచిది.. లేకపోతే మరో సావిత్రిలా తయారవుతుంది అంటూ చెప్పుకొస్తున్నారు. మరి చూడాలి నయనతార ఏం చేస్తుందో..?