Moviesనిహారికను పెళ్లి చేసుకోవాలి అనుకున్న యంగ్ హీరో..పెంట పెంట చేసిన మెగా...

నిహారికను పెళ్లి చేసుకోవాలి అనుకున్న యంగ్ హీరో..పెంట పెంట చేసిన మెగా హీరో..!?

జనరల్ గా పెళ్లి చేయాలన్న.. ఇల్లు కట్టాలన్న బోలెడంత కష్టమని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు. అలా చేసిన వాళ్ళకి దానిలోని పెయిన్ తెలుస్తుంది . అయితే ఇల్లు కట్టడం పక్కన పెడితే పెళ్లి విషయంలో మటుకు అమ్మాయిల జీవితాల్లో చాలా తలనొప్పుల ఉంటాయి. ఒక అబ్బాయిని అనుకోని మరొక అబ్బాయిని చేసుకుని జీవితంలో తమ ఇష్టమైన వాటిని దక్కించుకోలేని అమ్మాయిలు కూడా బోలెడు మంది ఉన్నారు. అయితే సినీ ఇండస్ట్రీలో కూడా అలాంటి స్టార్ సెలబ్రిటీస్ ఉన్నట్లు తెలుస్తుంది.

మనకు తెలిసిందే ఈ మధ్యనే మెగా డాటర్ నిహారిక జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకుంది. తన మ్యారీడ్ లైఫ్ ని స్టార్ట్ చేసింది , అబ్బో వీళ్ళ పెళ్లి అంగరంగ వైభవంగా రాజుల కాలం నాటి విధంగా జరిపించారు నాగబాబు. ఇది ఉంది ఇది లేదు అని లేకుండా విచ్చలవిడిగా డబ్బులు కుమ్మరిచ్చి.. ఒక కూతురు పెళ్లిని గ్రాండ్గా సెలబ్రేట్ చేశాడు. అయితే పెళ్లి తర్వాత నిహారిక తన పనులతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. కాగా రీసెంట్గా నిహారికకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ మ్యాటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటంటే మెగా డాటర్ నిహారికను యంగ్ హీరో పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. ఆమెతో కలిసి సినిమా చేసిన ఈ యంగ్ హీరో ఆమెకు ఫస్ట్ చూపులోనే కనెక్ట్ అయ్యాడట . నిహారికకు ఆ ఆలోచన లేకపోయినా.. కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు పుట్టుకొచ్చాయి. నిహారికను త్వరలోనే ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడని మెగా ఇంటి అల్లుడు కాబోతున్న యంగ్ హీరో అంటూ వార్తలు వినిపించాయి.

దీంతో నాగబాబు మ్యాటర్ లోకి ఎంటర్ అయ్యి ..”అలాంటిది ఏదీ లేదని నిహారిక కు అప్పుడే పెళ్లి చేసే ఆలోచన లేదని.. ఆ టైంలో చెప్పుకొచ్చాడు”. అంతేకాదు మరోసారి ఆ యంగ్ హీరోతో నటించకుండా నిహారికను దూరం పెట్టారు. ఇలా సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు వార్తలు రావడంతో మెగా డాటర్ పై లేని కొన్ని ట్రోల్స్ చేశారు కొందరు జనాలు . కాగా ప్రజెంట్ నిహారిక భర్త నాగచైతన్యతో హ్యాపీగా మ్యారీడ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news