స్టార్ హీరోలు అనగానే సహజంగా వాళ్లు పోషించే క్యారెక్టర్లపై ఆసక్తి ఎక్కువుగా ఉంటుంది. చారిత్రక, పౌరాణిక, సాంఘీక, జానపద నేపథ్యంలో స్టార్ హీరోలు పోషించే పాత్రల్లో వైవిధ్యం ఉంటే ప్రేక్షకులకు ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. అయితే ఈ పాత్రల్లో బాగా హిట్ అయిన పాత్ర అల్లూరి సీతారామరాజు. సూపర్‌స్టార్ కృష్ణ నుంచి రామ్‌చరణ్ వరకు అందరూ ఈ పాత్ర పోషించారు. ఇలా అల్లూరి పాత్ర పోషించిన ఆ హీరోలు ఎవ్వరో ఏంటో ఓ లుక్కేద్దాం.
కృష్ణ :
అల్లూరి సీతారామ రాజు జీవిత కథను కృష్ణ అద్భుతంగా తెరకెక్కించారు. అసలు ఈ పాత్రలో కృష్ణను తప్ప మరొకరిని ఊహించుకోలేం అన్నంత గొప్పగా నటించారు. ఈ సినిమాకు వి. రామచంద్రరావు దర్శకుడు. త్రిపురనేని మహారథి కథ ఇవ్వగా… కృష్ణ సోదరుడు జి. హనుమంతరావు నిర్మాత. 1974 మే 1న వచ్చిన ఈ సినిమా చరిత్ర క్రియేట్ చేసింది.
ఎన్టీఆర్ :
అల్లూరి సీతారామ రాజు సినిమా చేయాలన్న కోరిక ఎన్టీఆర్‌కు బలంగా ఉండేది. అయితే ఆ సినిమాను కృష్ణ చేసేయడంతో చివరకు మేజర్ చంద్రకాంత్ సినిమాలో ఓ పాటలో సీతారామరాజుగా నటించిన ఎన్టీఆర్ ఆ కోరికను తీర్చుకున్నారు. అయితే అల్లూరి గెటప్‌లో ఎన్టీఆర్ అదిరిపోయారు.
బాలకృష్ణ :
నటసింహం బాలకృష్ణ భారతంలో బాల చంద్రుడు – ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలలో అల్లూరి పాత్ర పోషించి మెప్పించారు.
రామ్ చరణ్ :
ఇక ఇటీవల వచ్చిన పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్‌లో రామ్‌చరణ్ అల్లూరి పాత్రలో ఆకట్టుకున్నాడు. అసలు రామ్‌చరణ్‌ను ఈ పాత్రలో చూసిన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.