హీరోయిన్లందరినీ వాడే కోలీవుడ్ హీరో..వాళ్ళూ తప్పదనే.. ఒప్పుకుంటారట. అది అన్ని రకాలుగా అనేది ఇక్కడ సారాశం. ఇంతకీ ఆ హీరో ఎవరనేది అసలు స్టోరీలో చూద్దాం. తమిళంలో విజయ్, సూర్య, కార్తి, అజిత్, విక్రం, ధనుష్, శివ కార్తికేయన్, కమల్ హాసన్, రజనీకాంత్..వీళ్ళంతా మంచి ఫాంలో ఉన్న హీరోలు. దాదాపు అందరూ పాన్ ఇండియా స్టార్స్‌గా క్రేజ్ ఉన్న వాళ్ళే. ఇప్పటికే, విజయ్ పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అందుకున్నాడు. కమల్ హాసన్, రజినీకాంత్ గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పుకోవడం అనవసరం.
వాళ్ళు ఈ రేంజ్ సినిమాలను ఎప్పుడో చేసేశారు. ఇక ధనుష్, కార్తీ, సూర్య..బాక్సాఫీస్ వద్ద వారికున్న మార్కెట్ ఏంటో అందరికీ తెలిసిందే. ఈ హీరోలు కోలీవుడ్‌లో మాత్రమే కాకుండా ఇప్పుడు టాలీవుడ్ మార్కెట్‌ను కూడా గట్టిగా టార్గెట్ చేశారు. ఇక్కడ దాదాపు ఈ హీరోలందరికీ క్రేజ్ ఉంది. అందుకే, అందరు తమ సినిమాలను తెలుగులో డబ్బింగ్ చేసి వదులుతున్నారు. ఇక విజయ్, ధనుష్, శివ కార్తికేయన్ తెలుగులో స్ట్రైట్ సినిమాలను చేస్తూ టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నారు.
అయితే, తమిళంలో విజయ్‌తో పోటీ పడే హీరో ధనుష్ అని చెప్పుకుంటుంటారు. విజయ్ చేసిన దర్శకులతో ధనుష్ కూడా సినిమా చేసి హిట్ కొట్టాలని పట్టుదలగా ఉంటాడని ఓ టాక్ ఉంది. అంతేకాదు, విజయ్ కంటే ఓ మెట్టు పైన ఉండేలా ఎప్పటికప్పుడు పాన్ ఇండియా వైడ్ ఆకట్టుకునే కథలను ఎంచుకుంటున్నాడు. మరీ ముఖ్యంగా ఓ విషయంలో ధనుష్ బాగా విజయ్‌తో పోటీ పడుతుంటాడనేది కోలీవుడ్ మీడియాలో సాగే చర్చ.
అదేమిటంటే విజయ్ తన సినిమాలో తీసుకున్న హీరోయిన్‌ను ఖచ్చితంగా ధనుష్ కూడా వాడాల్సిందేనట. ఈ విషయాన్ని గనక గమనిస్తే విజయ్ సరసన నటించిన హీరోయిన్‌ను ఆ నెక్స్ట్ సినిమాలో ధనుష్ తీసుకుంటున్నాడు అని అర్థమవుతుంది. కీర్తి సురేష్, కాజల్, సమంత లాంటి స్టార్ హీరోయిన్స్‌నే పరిశీలించవచ్చు. అంతేకాదు, కాస్త రొమాంటిక్‌గా కూడా ఉంటాడట. బయటకు రాకపోయినా లోలోపల ఈ విషయం తిరుగుతూనే ఉంటుంది.
ధనుష్‌కి హీరోయిన్స్ అంటే బాగా మోజు, క్రేజు ఉంటుందట. తన కంట్లో పడిన ఏ హీరోయిన్ అయినా తన సినిమాలో హీరోయిన్‌గా నటించాల్సిందే..తనతో రొమాన్స్ చేయాల్సిందేనట. డేట్స్ సర్దుబాటు కాకపోయినా మొండిగా పట్టుపట్టడంతో హీరోయిన్స్ కూడా కాదని చెప్పరట. ఇది గనక నిజమే అయితే ధనుష్‌లో ఇది కనపడని కోణం అనుకోవచ్చు.