ఆ తెలుగమ్మాయికి ఈ టాలెంటెడ్ డైరెక్టర్‌కి మధ్య అది నిజమేనా..? అనేది వారు కనిపించినప్పుడల్లా హాట్ టాపిక్‌గా మాట్లాడుకుంటున్నారు. సాధారణంగా ఓ దర్శకుడు, హీరోయిన్..హీరో హీరోయిన్, నిర్మాత హీరోయిన్ కలిసి కనిపిస్తే ..ఇద్దరి మధ్య కిచకిచ సంబంధం ఉందనే అనుకుంటారు. అయితే, నిప్పు లేనిదే పొగ రాదనేది కూడా మనం లెక్కలోకి తిసుకోవాలి. ఇండస్ట్రీలో కొందరు దర్శకులతో హీరోయిన్స్ సన్నిహితంగా ఉంటారనే మాట తరచుగా వినిపిస్తూనే ఉంటుంది.
అలా దర్శకులు అండగా ఉంటేనే హీరోయిన్స్ నిలబడి స్టార్స్‌గా వెలిగేది అనేది కూడా అటు ఇండస్ట్రీ వర్గాలలో ఇటు ప్రేక్షకులలో జరిగే చర్చ. ఇది ఎంతవరకూ నిజమో తెలియదు గానీ, మన దర్శకులు కొందరూ ఎక్కువగా ఒకే హీరోయిన్ ని తమ సినిమాలలో రిపీట్ చేస్తున్నారు. దీనివల్ల ఆ హీరోయిన్‌కి దర్శకుడికి లింక్ పెట్టి వార్తలు గట్టిగానే రాస్తున్నారు. వీటిపై స్పందించేవారు అప్పుడప్పుడు స్పందించి అబ్బే అదేమీ లేదండీ ఆ అమ్మాయిలో టాలెంట్ ఉంది. నా కథకి సూటవుతుందని అంటుంటారు.
అందుకే, రెగ్యులర్‌గా తననే తీసుకుంటున్నాను. అంతే తప్ప నేను రాసుకున్న కథలో ఆమె సూటవకపోతే ఆ ప్లేస్‌లో ఇంకో హీరోయిన్ని అయినా తీసుకోవాల్సిందే కదా..అని క్లారిటీ ఇస్తుంటారు. ఇవి మాటల మాంత్రికుడు, సీనియర్ దర్శకుడు త్రివిక్రమ్ మాటల్లాగా అనిపిస్తున్నాయి కదా. అవును ఆయన మాటలే. కానీ, ఆయన స్థానలో ఉన్న ప్రతీ దర్శకుడు తన సినిమాలో రిపీటెడ్‌గా ఒకే హీరోయిన్ని తీసుకునే దర్శకులందరూ చెప్పే మాట ఇదే. ఇంద్ర గంటి మోగన కృష్ణ కూడా తెలుగమ్మాయి ఈషారెబ్బ విషయంలో ఇలాగే చెప్పారట.
అంతకముందు ఆ తర్వాత, అమీ తుమీ, బందిపోటు సినిమాలలో ఈషాను హీరోయిన్గా తీసుకున్నారు ఇంద్రగంటి. ఇలా మూడు సినిమాలలో ఒకే హీరోయిన్ని రిపీట్ చేయడంపై అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వార్తలు వచ్చి చక్కర్లు కొట్టి వైరల్ అయ్యాయి. ఈషాకి ఇండస్ట్రీలో గట్టి సపోర్ట్ దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ అని. ఇది ఎంతవరకు నిజమో తెలీదు గానీ, ఆయన రాసుకున్న హీరోయిన్ పాత్రలకి ఈషా కరెక్ట్‌గా సూటవుతుందని తనని తీసుకోవడం జరిగింది తప్పా..మరో ఉద్దేశ్యం ఏమీ లేదని చెప్పి సైలెంట్ అయ్యారు.