టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్ గా `త్రిబుల్ ఆర్` సినిమాతో వరల్డ్ వైడ్‌గా రికార్డు స్థాయి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఎన్టీఆర్ కు పాన్ ఇండియా లెవెల్ లో దక్కిన తొలి సూపర్ డూపర్ హిట్ సినిమా `త్రిబుల్ ఆర్`. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వరుసగా క్రేజీ డైరెక్టర్లతో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లను లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ కెరియర్ లో 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ వెంటనే కేజీఎఫ్, సలార్ సినిమాల దర్శకుడు ప్రశాంత నీల్‌తో ఎన్టీఆర్ 31వ సినిమా తెరకెక్కనుంది. ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నాయి.
త్రిబుల్ ఆర్ సినిమాతో తనకు వచ్చిన పాన్ ఇండియా క్రేజ్ కంటిన్యూ చేసేందుకే ఎన్టీఆర్ వరుసగా పాన్ ఇండియా కథలలో నటించేందుకు ఓకే చెప్పాడు. ఇక ఎన్టీఆర్ 30వ ప్రాజెక్టును ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ బ్యానర్లపై నందమూరి కళ్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎప్పుడో ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 25న ఎన్టీఆర్ 31 పోస్టర్ రిలీజ్ చేశారు. ఇప్పటికే దాదాపు 5 నెలలు అవుతోంది. మరోవైపు ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయ్యి కూడా ఆరు నెలలు అవుతుంది. ఇప్పటికీ ఎన్టీఆర్ సినిమా పట్టాలు ఎక్కలేదు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు బాగా డిజప్పాయింట్ అవుతున్నారు.
అసలే `అరవింద సమేత వీర రాఘవ` సినిమా తర్వాత నాలుగు సంవత్సరాలు గ్యాప్ తీసుకుని `త్రిబుల్ ఆర్` సినిమాతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. త్రిబుల్ ఆర్ సినిమా భారీ బడ్జెట్ సినిమా.. పైగా రాజమౌళి దర్శకుడు. దీనికి తోడు కరోనా కూడా రావడంతో నాలుగు సంవత్సరాలు షూటింగ్ దశలోనే ఉంది. అయితే ఇప్పుడు కొరటాల సినిమా కోసం కూడా ఇంత టైం వేస్ట్ అవుతుండటం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు అస్సలు నచ్చట్లేదు. మరోవైపు కొరటాల కూడా ఆచార్య అట్టర్ ప్లాప్ అవడంతో నిరాశలో ఉన్నట్టే కనపడుతుంది. ఎన్టీఆర్ సినిమా కోసం ముందుగా అనుకున్న కథను కాదని.. మళ్లీ ఇప్పుడు మార్పులు చేర్పులు చేస్తున్నాడట.
కొరటాల బాగా టైం తీసుకోవడంతో పాటు కథలో మార్పులతో అంతా కంగాలీగా ఉండడంతో ఎన్టీఆర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కథ లేకుండా స్టార్ హీరోతో సినిమా స్టార్ట్ చేస్తే బ్రహ్మోత్సవంలానే రిజల్ట్ ఉంటుందని..కొరటాల ఇప్పటి వరకు కథ రెడీ చేసుకోకుండా ఏం చేశాడన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే టైం చాలా వేస్ట్ అయిపోయింది.సెప్టెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు.. చూస్తుంటే సెప్టెంబర్ కూడా అయిపోతుంది. ఈ లెక్కన అక్టోబర్ లో కూడా ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందా ? అంటే డౌట్ గానే కనిపిస్తోంది.
`ఆచార్య` ఫలితం తర్వాత కొరటాల బాగా ఫ్రస్టేషన్లో ఉన్నట్టే కనపడుతోంది. ఇటు ఎన్టీఆర్ కూడా ఇన్ని రోజులపాటు కొరటాలను నమ్మి ఖాళీగా ఉండడంతో కొరటాలపై అసహనంతోనే ఉన్నాడని అంటున్నారు. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు సైతం `త్రిబుల్ ఆర్` సినిమాతో ఎన్టీఆర్ కు ఏర్పడిన క్రేజ్ ని క్యాష్ చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. ఏదేమైనా ఎన్టీఆర్ 30వ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందని విషయంలో ఎవరికీ స్పష్టత అయితే లేదు. ఇందుకు కొరటాలదే పూర్తి బాధ్యత అని ఇండస్ట్రీలో చర్చలు నడుస్తున్నాయి.