టెక్నాలజీ ఇంత డెవలప్ అయ్యింది. కాలం వేగంగా ముందుకెళ్తుంది. ప్రజెంట్ ఉన్న బిజీ షెడ్యూల్లో వైఫ్ అండ్ హస్బెండ్ పట్టుమంటే పది నిమిషాలు కూడా కూర్చుని మాట్లాడుకునే పరిస్థితి లేదు ..కానీ ఇలాంటి టైంలో కూడా కొందరు బిగ్ స్టార్స్ ప్రముఖ వ్యక్తులు కులం అంటూ ఓ ట్యాగ్ ని అటాచ్ చేస్తూ మా కులపోడు, మా కులం ది అంటూ వాళ్ళ కులం వాళ్లని హైలెట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. తాజాగా ఇలాంటి పని చేసిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు.
మనకు తెలిసిందే రీసెంట్ గా జరిగిన సైమా అవార్డ్స్ లో పుష్ప సినిమా సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ అవార్డ్స్ అందుకుంది. ఉత్తమ నటుడుగా పుష్ప సినిమాకు గాను అల్లు అర్జున్ అవార్డు అందుకున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఏకంగా ఆరు అవార్డులు వచ్చాయి . దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా బన్నీ పేరు రేంజ్ లో మారుమ్రోగిపోతుంది. అంతేకాదు ఆయన ఈ సినిమాలో చెప్పిన డైలాగ్ తగ్గేదేలే అంటూ ఆయనని ట్యాగ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఎప్పుడూ లేని విధంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి బన్నీ గురించి ట్విట్ చేయడంతో ఇప్పుడు కధ అడ్డం తిరిగింది.
విజయ్ సాయి రెడ్డి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు . ముఖ్యంగా ట్విట్టర్లో ఫుల్ జోష్ లో రాజకీయ నాయకులకు తనదైన స్టైల్ లో ట్విట్ చేస్తూ కౌంటర్లు ఇచ్చే విజయసాయిరెడ్డి రీసెంట్ గా బన్నీని కాక పట్టడం రాజకీయాల్లో కొత్త డౌట్లు పుట్టిస్తుంది. అంతేకాదు ఓవర్గం బన్నీ ని కావాలనే టార్గెట్ చేస్తూ రాజకీయాల రంగులు అద్దుతూ ఆయనను ట్రోల్ చేస్తుంది . బన్నీ భార్య స్నేహ రెడ్డి . ఆమె రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన అమ్మాయి . వీళ్లది లవ్ మ్యారేజ్. ప్రేమకు కులం అడ్డురాదు అంటూ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్నారు ఈ జంట.
ఇప్పుడు అదే రెడ్డి అనే ట్యాగ్ తో బన్నీను ట్రోల్ చేస్తున్నారు కొందరు నెటిజన్స్. సైమా ఫంక్షన్ లో చాలా మందికి అవార్డ్స్ వచ్చాయని. కానీ వాళ్లు ఎవరు విజయసాయి కళ్లకి కనపడలేదు అని..కేవలం రెడీ ఫ్యామిలీ అమ్మాయిని చేసుకున్న బన్నీ నే కనిపించాడని..అందుకే ఎప్పుడు లేని విధంగా విజయసాయిరెడ్డి బన్నీను పొగిడేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలా బన్నీను పొగుడుతూ ట్విట్ చేయడంతో వైసీపీ బన్నీకు బిస్కెట్ వేస్తుంది అంటున్నారు కొందరు నెటిజన్స్. అంతేకాదు ఆ రెడ్డి అనే ట్యాగ్ తో బన్నీను తమ వైపు లాక్కోవాలని చూస్తున్నారు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు/ దీంతో బన్నీ పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . మరి చూడాలి బన్నీ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో..?
పాన్ ఇండియా మూవీగా రికార్డ్స్ బ్రేక్ చేసి సైమా అవార్డుల్లో సత్తాచాటి ఏకంగా 6 అవార్డులు గెలుచుకున్న ‘పుష్ప’ చిత్రం యూనిట్ కు అభినందనలు. సినిమాలో అల్లు అర్జున్ నటన, సుకుమార్ దర్శకత్వం అద్భుతం. తెలుగు సినిమా ‘తగ్గేదే లే’ అని నిరూపించారు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 12, 2022