Moviesఎంగేజ్మెంట్ అయ్యాక కూడా తెలివిగా పెళ్లి త‌ప్పించుకున్న ర‌ష్మిక‌... ఆ ప‌ని...

ఎంగేజ్మెంట్ అయ్యాక కూడా తెలివిగా పెళ్లి త‌ప్పించుకున్న ర‌ష్మిక‌… ఆ ప‌ని చేయ‌క‌పోతే కెరీర్ సంక‌నాకిపోయేదే…!

ఇండస్ట్రీలో చాలా మంది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. ఇది చాలా రొటీన్ డైలాగ్. కానీ చాలా తక్కువమంది ఎంగేజ్‌మెంట్ అయ్యాక దానీ క్యాన్సిల్ చేసుకొని సినీ కెరీర్ ప్రారంభించి సక్సెస్ అయ్యేవారు. బహుషా అలాంటి వారికి వేళ్ళమీద లెక్కపెట్టొచ్చేమో. వారిలో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న కూడా ఉన్నారు. రష్మిక ముందు ఇంతపెద్ద స్టార్ హీరోయిన్ అవుతానని ఊహించలేదు. అస‌లు త‌న‌కు ఇంత స్టార్ డ‌మ్ వ‌స్తుంద‌ని ఆమె క‌ల‌లోనే ఊహించ‌లేద‌ట‌. ర‌ష్మిక 2016లో కిరిక్ పార్టీ అనే కన్నడ చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమమైంది.

కిరిక్ పార్టీ సమయంలోనే త‌న తొలి సినిమా హీరో ర‌క్షిత్ శెట్టితో ప్రేమలో పడిన రష్మిక.. తమ బంధాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునే ఎంగేజ్మెంట్ చేసుకుంది. క‌న్న‌డ‌లో ఆమె తొలి సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్‌తో తెలుగులో ఛలో సినిమా చేసే అవకాశం అందుకుంది. ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో మళ్ళీ ఇప్పటి వరకు తిరిగి చూసుకోవాల్సిన అవసరం రష్మికకి రాలేదు. ఛలో తర్వాత చేసిన దేవదాసు ఫ్లాప్‌గా మిగిలింది.

ఆ తర్వాత కూడా డియర్ కామ్రేడ్ సినిమా డిజాస్టర్ అయింది. అయినా అందరూ గుర్తు పెట్టుకుంది మాత్రం గీత గోవిందం, సరిలేరు నీకెవ్వరు సినిమాలు. అందుకే, పాన్ ఇండియా సినిమా పుష్ప పార్ట్ 1లో అవకాశం అందుకుంది. ఈ సినిమా సక్సెస్ రష్మికకి బాలీవుడ్‌లో వరుసగా అవకాశాలు తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇటు తెలుగులో అటు హిందీలో క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది.

ఛ‌లో త‌ర్వాత ఆమెకు వ‌చ్చిన క్రేజ్‌, అవ‌కాశాల నేప‌థ్యంలో ఆమె ఇప్ప‌ట్లో త‌న‌కు పెళ్లి వ‌ద్ద‌నుకుని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుంది. రష్మిక ఎంగేజ్‌మెంట్ తర్వాత సినిమాలు వద్దనుకుంటే ఇప్పుడు ఆమె ఎవరో కూడా ఎవరికీ తెలిసేది కాదు. ముందే ఈ క్రేజ్ ఊహించిందా ? అంటే అది ఎవరూ చెప్పలేరు. కానీ, అప్పుడు రష్మిక సినిమా కెరీర్ పరంగా తీసుకున్న నిర్ణయం మాత్రం అద్భుతమని చెప్పక తప్పదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news