Gossipsప్రభాస్ అనుష్క పెళ్లి.. సంచలనం రేపుతున్న ఉమర్ సంధు ట్వీట్..!

ప్రభాస్ అనుష్క పెళ్లి.. సంచలనం రేపుతున్న ఉమర్ సంధు ట్వీట్..!

సెలబ్రిటీస్ విషయంలో ఎలాంటి చిన్న విషయమైనా సరే రూమర్ అయినా సరే సంచలనంగా మారుతుంది. ఈ క్రమంలో ప్రభాస్ పెళ్లిపై ఓ క్రిటిక్ చేసిన ట్వీట్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, స్వీటీ అనుష్క పీకల్లోతు ప్రేమలో ఉన్నారని ఈ ఇయర్ ఎండింగ్ కల్లా వారి పెళ్లి వార్త బయట పెడతారని ట్వీట్ చేశాడు యూ.ఏ.ఈ క్రిటిక్ ఉమర్ సంధు.

తనకు ఈ విషయం ప్రభాస్ సన్నిహితుల ద్వారానే తెలిసింది అంటూ ట్వీట్ చేయడం విశేషం. ఓ పక్క ప్రభాస్ కు అనుష్కతో లింక్ పెట్టి రాస్తున్న వార్తలతో ఇద్దరి ఇబ్బంది పడుతుండగా ఇప్పుడు ఏకంగా ప్రభాస్ పెళ్లి చేసుకునేది అనుష్కనే అంటూ ఉమర్ సంధు ట్వీట్ చేయడం హాట్ న్యూస్ గా మారింది.

సినిమా రిలీజ్ కు ముందే తన రివ్యూతో హడావిడి చేసే ఉమర్ సంధు ఇప్పుడు ప్రభాస్ పెళ్లిపై తన ఫోకస్ పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఈమధ్యనే పెళ్లిపై రూమర్స్ అన్నిటికి చెక్ పెట్టేసి తాను అందరికి చెప్పే పెళ్లిచేసుకుంటా అని చెప్పిన ప్రభాస్ ఉమర్ సంధు చేసిన ట్వీట్ కు ఎలా రెస్పాండ్ అవుతాడో చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news