సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా శోకసంద్రంలో నిండిపోయింది. గత కొంతకాలంగా వరుస విషాదాలతో నిండిపోతున్న సినీ ఇండస్ట్రీ కొద్దిసేపటి క్రితమే ఉలిక్కిపడే వార్త వినింది. ఈ వార్త విన్న ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. అదే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణ వార్త. ఇప్పటికీ ఈ విషయాన్ని ఎవరు నమ్మలేకపోతున్నారు . ఆయన అభిమానులు ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. రెబల్ స్టార్ కృష్ణంరాజు (83) .ఆఈఘ్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ ఉదయం తెల్లవారుజామున 3:25 గంటలకు తుది శ్వాస విడిచారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున హాస్పిటల్ లోనే తుది శ్వాస విడిచారు. 83 ఏళ్ల కృష్ణంరాజుకి ముగ్గురు కూతుళ్లు. 1940 జనవరి 20 ఆయన జన్మించారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు ఆయన స్వగ్రామం. సినీ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న కృష్ణంరాజు ఇలా సడెన్ గామరణించడంతో సినీ ఇండస్ట్రీలో పెను విషాదం చోటు చేసుకుంది. దీంతో రెబల్ ఫ్యాన్స్ అందరు శోకసంద్రంలో మునిగిపోయారు.
కాగా రెబల్ స్టార్ కృష్ణంరాజు జీవితంలో మిగిలి ఉన్న ఏకైక కోరిక తీరకుండానే చనిపోయారంటూ ఓ వార్త వైరల్ గా మారింది. మనకు తెలిసిందే కృష్ణంరాజుకు ప్రభాస్ అంటే ఎంత ఇష్టమో .రెబల్ వారసుడు ఆయన. అయితే ఆయన ఆరోగ్యం బాగోలేనప్పటి నుంచి ప్రభాస్ కి పెళ్లి చేయాలని బాగా ట్రై చేశారట . కానీ కొన్ని కారణాల వల్ల ప్రభాస్ పెళ్లిని వాయిదా వేసుకుంటూ రావడంతో.. చివరికి ఆయన ఆరోగ్యం క్షీణించి మరణించడం తో ప్రభాస్ పెళ్లి చూడకుండానే ఆయన లాస్ట్ కోరిక తీరకుండానే చనిపోయారు . ఈ విషయం తెలుసుకున్న రెబల్ అభిమానులు మరింతగా బాధపడుతున్నారు.
కృష్ణం రాజు మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు “ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఆయన ఆత్మ ఎక్కడ ఉన్న శాంతించాలని.. ఆయన లేని లోటు సినీ ఇండస్ట్రీకి కచ్చితంగా తెలుస్తుంది” అంటూ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సినీ అభిమానులు చిత్ర ప్రముఖులు కృష్ణంరాజు మృతికి సంతాపం ప్రకటిస్తున్నారు.