Moviesబ్రేకింగ్: ఔను.. సిద్ధార్ధ్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు..!?

బ్రేకింగ్: ఔను.. సిద్ధార్ధ్ ఆ హీరోయిన్ ని పెళ్లి చేసుకోబోతున్నాడు..!?

హీరో సిద్ధార్థ్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. తనదైన స్టైల్ లో నటిస్తూ యంగ్ లుక్స్ లో అదరగొడుతూ.. మంచి మంచి స్టోరీలను సెలెక్ట్ చేసుకుని ..సినీ ఇండస్ట్రీకి వచ్చిన అనతి కాలంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. సిద్ధార్థ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్స్ అంటే టక్కున గుర్తొచ్చేది నువ్వొస్తానంటే నేనొద్దంటానా ,బొమ్మరిల్లు.. రెండు సినిమాల్లో సిద్ధార్థ తనదైన స్టైల్ లో మెప్పించాడు.

కాగా సినీ కెరియర్ పరంగా సిద్ధార్ధ్ అనుకున్నంత స్థాయికి రీచ్ కాలేకపోయాడు. ఎంత త్వరగా స్టార్ హీరోల లిస్టులోకి చేరిపోయాడో.. అంతే త్వరగా ఫ్లాప్ హీరోల లిస్టులోకి యాడ్డ్ అయ్యాడు . దానికి రీజన్ ఆయన పర్సనల్ క్యారెక్టర్. ఏ సినిమాలో హీరోయిన్ తో నటించిన ఆ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకుంటాడు అని ఓ గుడ్డి రూమర్ సినీ ఇండస్ట్రీలో ఉంది. దాని నిజం చేస్తూ సిద్ధార్థ్ ఆ హీరోయిన్లతో పబ్బులు, పార్టీలు అంటూ తిరుగుతూ మీడియా కంట పడిన దృశ్యాలు ఉన్నాయి.

ఈ క్రమంలోనే సిద్ధార్థ్, శృతిహాసన్, సమంత, హన్సిక అందరు ఎఫైర్ నడిపిన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. కాగా ఆయన లాస్ట్ గా నటించిన మహాసముద్రం సినిమాలో హీరోయిన్ గా చేసిన అదితి రావు హైదరి తో ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమెతో పర్సనల్ గా జిమ్ కి వెళ్లడం ..పార్టీలకు వెళ్లడం.. షాపింగ్ లు చేయడం ..వంటి ఫొటోస్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంటున్నాయి.

కాగా రీసెంట్ గా చెన్నైలో జరిగిన పోనియన్ సెల్వవన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు ఈ జంట కలిసి అటెండ్ అయ్యారు. అంతేకాదు అక్కడ వీళ్ళ ప్రవర్తించిన తీరు నడుచుకున్న విధానం కచ్చితంగా చూసిన వాళ్ళకి కాబోయే భార్య భర్తలు లాగే అనిపిస్తుంది. అంత అట్రాక్ట్ చేసింది ఈ జంట. హాట్ లుక్స్ తో కనిపించారు. దీంతో అభిమానులు డౌట్ లేదు వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ గట్టిగా సోషల్ మీడియాలో వార్తలను వైరల్ చేస్తున్నారు. మరి చూడాలి సిద్ధార్థ్ హైదరి నిజంగానే పెళ్లి చేసుకోబోతున్నారా..? లేదా అనేది..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news