మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చాక ఖైదీ నెంబర్ 150 సినిమా మినహాయిస్తే చేసిన రెండు సినిమాలు ఆయనకు నిరాశా ఫలితాలే ఇచ్చాయి. సైరా బడ్జెట్ ఫెయిల్యూర్ అయ్యింది. ఇక ఆచార్య చిరు పరువు మొత్తం తీసేసింది. రెండున్నరేళ్లుగా ఊరిస్తూ ఊరిస్తూ వచ్చిన ఆచార్య అట్టర్ ప్లాప్ అవ్వడంతో పాటు చిరు మార్కెట్‌ను పూర్తిగా డౌన్ చేసేసింది. ఆచార్య తర్వాత చిరు చేస్తోన్న మూడు సినిమాలపై నిజం చెప్పాలంటే మెగాభిమానుల్లోనే అంత అంచనాలు లేవు.
ఇందుకు కారణం చిరు రీమేక్ కథలు ఎంచుకోవడం ఒక మైనస్ అయితే… డైరెక్టర్లు కూడా అంత క్రేజ్ ఉన్న వారు కాదు. గాడ్‌ఫాధర్ డైరెక్టర్ మోహనరాజా చాలా యేళ్ల తర్వాత తెలుగు సినిమా చేస్తున్నాడు. అసలు ఆ సినిమాను ఇప్పటికే మూడేళ్లుగా మనోళ్లు చాలాసార్లు చూసేశారు. ఇక భోళాశంకర్ డైరెక్టర్ మెహర్ రమేష్ ను ఏ హీరో దగ్గరకు రానివ్వలేదు. పైగా వేదాళం రీమేక్ అంటే ఎంత రాడ్డో అని మెగాభిమానులే అంటున్నారు.
ఇక వాల్తేరు వీరయ్య డైరెక్టర్ బాబికి కూడా సరైన హిట్ లేదు. బాబి పెద్ద హీరోలను సరిగా హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. ఇక ఈ మూడు సినిమాల్లో ముందు లైన్లో ఉన్న గాడ్‌ఫాధర్ రిలీజ్ డేట్ విషయంలో పెద్ద గందరగోళమే నడుస్తోంది. అసలే ఇది రీమేక్. ఇప్పటికే రిలీజ్ అయిన స్టిల్స్, లుక్స్ ప్రేక్షకుల్లో కాదు మెగాభిమానుల్లోనే క్యూరియాసిటీ పెంచలేదు.
ఇక గాడ్ ఫాధర్ విషయానికి వస్తే దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ అన్నారు. పైగా అదే రోజు నాగార్జున ది ఘోస్ట్ సినిమా కూడా వస్తోంది. ఈ సినిమా రిలీజ్‌కు గట్టిగా మూడు వారాలే టైం ఉంది. అయితే సినిమాపై బజ్ పెంచే ప్రయత్నాలు జరగడం లేదు. ఇటీవలే రిలీజ్ అయిన టీజర్లు వీఎఫ్ఎక్స్ షాట్స్ కూడా బాలేదన్న చర్చలు వచ్చాయి. దీంతో మళ్లీ సీజీ వర్క్ చేస్తున్నారట. దీంతో దసరా డెడ్ లైన్ అందుకుంటామా ? అన్న టెన్షన్ కూడా మేకర్స్ కు ఉందంటున్నారు.
ఇక తాజాగా ఈ సినిమా దసరాకు రిలీజ్ కాదన్న పుకార్లు కూడా వచ్చాయి. ఫ్యాన్స్ బాగా డిజప్పాయింట్ అయిపోయారు. ఇదే టైంలో మేకర్స్ నుంచి అదే డేట్‌కు వస్తామన్న క్లారిటీ వచ్చింది. ఏదేమైనా గాడ్ ఫాధర్ విషయంలో ఏదో తేడా కొడుతోందన్న గుసగుసలు ఇండస్ట్రీ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి.