ప్రస్తుతం పూజా హెగ్డే కెరీర్ డేంజర్ జోన్లో ఉందనే చెప్పలి. దీనికి కారణం ఇటీవల ఆమె హీరోయిన్గా నటించిన సినిమాలు వరుసగా ఫ్లాపవడం అలాగే, తనతోటి హీరోయిన్స్‌కి మంచి హిట్స్ వస్తూ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో అవకాశాలు దక్కుతుండటమే. ముఖ్యంగా ఇక్కడ రష్మిక మందన్న, కృతి శెట్టి లాంటి వారి దెబ్బను తట్టుకోలేకపోతుంది. ఇండస్ట్రీలో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన చాలా కాలానికి హిట్స్ వచ్చాయి. అయితే, పూజా పక్కా కమర్షియల్.
అందుకే, వచ్చీన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. ఈ క్రమంలో వరుసగా హిట్స్ పడ్డాయి. అలాగే, పాన్ ఇండియా రేంజ్లో రూపొందిన రాధే శ్యామ్మ్, బీస్ట్, ఆచార్య చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోరంగా పరాజయాన్ని చూశాయి. అయినా ఐటెం సాంగ్స్ కూడా చేసే ఛాన్స్ వస్తే వదలడం లేదు. ఇప్పుడు పూజా హెగ్డే చేతిలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు చిత్రాలున్నాయి. ఇవి రెండు కూడా సెట్స్ మీదకి రావాల్సి ఉంది.
ఇక మరోసారి పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కలిసి చేస్తున్న భారీ చిత్రం జనగణమన సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. అయితే, పూరి, విజయ్ కలిసి చేసిన పాన్ ఇండియా సినిమా లైగర్ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. దీనికి ముందు మేకర్స్ చాలా నమ్మకాలు పెట్టుకొని మాట్లాడుకున్నారు. ఆ ఊపులోనే హీరోయిన్ పూజా అయితే సూపర్ అని భావించారు. ఆ రకంగానే జనగణమన సినిమా ఓపెనింగ్‌కి వచ్చింది.
ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తైంది. అయితే, లైగర్ ఫ్లాప్ వల్ల ఇప్పుడు జనగణమన సినిమా బడ్జెట్‌ను పూర్తిగా తగ్గించారని తెలుస్తోంది. అంతేకాదు, ముందు ఈ సినిమాకు పూజా రెమ్యునరేషన్ చాలా ఎక్కువ అడిగితే ఓకే అన్నారట. ఇప్పుడేమో లైగర్ ఫ్లాప్ కాబట్టి పూజా రెమ్యునరేషన్ తగ్గించారట. ఎటూ ఫ్లాపుల్లో ఉంది కాబట్టి ఇస్టముంటే చేస్తుంది లేదంటే తప్పుకుంటుందని పూరి టీం భావిస్తుందని సమాచారం. ఒకవైపు రష్మిక రెమ్యునరేషన్ పెరుగుతుంటే..ఇలా పూజా రెమ్యునరేషన్ తగ్గడం హాట్ టాపిక్‌గా మారింది.