నందమూరి వంశానిది టాలీవుడ్లో ఏకంగా ఆరేడు దశాబ్దాల చరిత్ర. ఎన్టీఆర్ ఆ తర్వాత రెండో తరంలో హరికృష్ణ కొన్ని సినిమాలు చేశారు. ఇక ఇప్పటకీ కూడా రెండో తరం నుంచి బాలయ్య స్టార్ హీరోగా ఉన్నారు. ఇక ఇప్పుడు మూడో తరం నందమూరి హీరోల్లో ఎన్టీఆర్ నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నారు. మూడో తరంలో ఇప్పటి వరకు నందమూరి అభిమానుల ఆశలు అన్నీ ఒక్క జూనియర్ ఎన్టీఆర్ మీదే ఉన్నాయి.
ఇక ఇదే ఫ్యామిలీ నుంచి మూడో తరంలో ఎన్టీఆర్‌తో పాటు కళ్యాణ్‌రామ్, తారకరత్న కూడా ఎంట్రీ ఇచ్చారు. వీరిలో ఎన్టీఆర్ టాప్ పొజిషన్ పక్కన పెడితే కళ్యాణ్‌రామ్ పదిహేనేళ్ల నుంచి ఇండస్ట్రీలో కంటిన్యూ అవుతూనే ఉన్నాడు. తాజాగా బింబిసార సినిమాతో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఒకేసారి 9 సినిమాలు ప్రారంభోత్సవం జరుపుకోవడంతో వార్తల్లోకి వచ్చిన తారకరత్న అంతే త్వరగా కనుమరుగైపోయాడు.
ఇక ఇప్పుడు ఇదే నందమూరి వంశంలో మూడో తరం నుంచి బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మోక్షు డెబ్యూ మూవీపై మూడు, నాలుగేళ్లుగా చర్చలు నడుస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మోక్షు డెబ్యూ మూవీ కోసం ట్యాక్సీవాలా, శ్యామ్ సింగరాయ్ సినిమాల దర్శకుడు రాహుల్ సంక్రీత్యాన్ పేరు వినపడుతోంది. రాహుల్‌తో మోక్షు డెబ్యూ మూవీ కోసం అద్భుతమైన ప్రేమకథను తీసుకుంటున్నారట.
మోక్షు డెబ్యూ మూవీ కూడా ప్రేమకథతోనే తెరకెక్కితే నందమూరి వంశంలో మూడో తరంలో నలుగురు హీరోలు అయిన ఎన్టీఆర్ – కళ్యాణ్‌రామ్ – తారకరత్న – మోక్షజ్ఞ డెబ్యూ సినిమాలు ప్రేమకథతోనే తెరకెక్కినట్లవుతుంది. నందమూరి మూడో తరం వారసుల్లో జూనియర్ ఎన్టీఆర్ (నిన్ను చూడాలని) – కళ్యాణ్ రామ్ (తొలి చూపులోనే) – తారక రత్న (ఒకటో నెం. కుర్రాడు) ముగ్గురూ ప్రేమ కథలతోనే హీరోలు అయ్యారు.
ఇప్పుడు మోక్షజ్ఞ కూడా ప్రేమకథతో పరిచయం అయితే ఇదో అరుదైన రికార్డ్ అవుతుంది. అయితే ఎన్టీఆర్ తొలి సినిమా నిన్ను చూడాలని, కళ్యాణ్‌రామ్ తొలిచూపులోనే, తారకరత్న ఒకటో నెంబర్ కుర్రాడు ఈ మూడు సినిమాలు ఆశించినంత విజయం సాధించలేదు. మరి ఇప్పుడు మోక్షు ఆ సెంటిమెంట్‌ను ఎలా ? బ్రేక్ చేస్తాడో ? చూడాలి.