“వావ్ భలే ఉంది.. ప్రియమణి చూడ చక్కటి బొమ్మలా ఉంది”.. ఇలాంటి కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మనకు తెలిసిందే ప్రియమణి “ఎవరే అతగాడు “సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయింది . మొదటి సినిమాతోనే తనలోని నటిని బయటకు తీసుకొచ్చిన ప్రియమణి ..ఆ తర్వాత నెమ్మదిగా వచ్చిన సినిమాలలో నచ్చిన సినిమాలు చేస్తూ అభిమానులను తనదైన స్టైల్ లో మెప్పించింది. మరీ ముఖ్యంగా ప్రియమణికి లైఫ్ ఇచ్చిన సినిమా అంటే అది కచ్చితంగా పెళ్లయిన కొత్తలో మూవీ అనే చెప్పాలి.
ఈ సినిమాలో అమ్మడు నటించిన తీరుకి జనాలు ఫిదా అయ్యారు. జగపతిబాబుతో చేసిన రొమాన్స్ ఇప్పటికీ కుర్రాలను హీట్ పుట్టిస్తూనే ఉంటుంది. కాగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ప్రియమణి ఖాతాలో ఫ్లాప్స్ పడడంతో అవకాశాలు తగ్గాయి. నిజం చెప్పాలంటే యమదొంగ సినిమా తర్వాత ప్రియమణి ఖాతాలో హిట్ అనేది లేదు . వరుస ప్లాపులతో సతమతం అయింది. ఈ క్రమంలోనే సినీ ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉన్న ఈ అమ్మడు.. ఆ తర్వాత ఓ వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ టైంలో హ్యూజ్ ట్రోలింగ్ కు గురైంది .
ఎందుకంటే ప్రియమణి పెళ్లి చేసుకున్న అబ్బాయికి ఇదివరకే పెళ్లయిందని.. పిల్లలు ఉన్నారని సమాచారం. కాగా ఆ టైంలో పాపులర్ అయిన ప్రియమణి తన రీఎంట్రీని భారీగా ప్లాన్ చేసుకుంది. ఈ క్రమంలోనే ముందుగా ఢీ షో కి జడ్జిగా వచ్చి తనదైన స్టైల్ లో మెప్పిస్తూ షోకి వచ్చిన గెస్ట్ లను అట్రాక్ట్ చేస్తూ క్రేజీ ఆఫర్స్ ను పట్టేసింది. ఈ క్రమంలోనే.. ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో అవకాశం అందుకొని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత వచ్చిన భామ కలాపం ఫ్లాప్ అయినా ప్రజెంట్ ప్రియమణి పుష్ప2లో కూడా ఓ రోల్ చేయబోతుందని తెలుస్తుంది.
ప్రియమణి ప్రజెంట్ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతో రెచ్చిపోయి మరి టెంప్ట్ చేస్తుంది. ఈ క్రమంలోనే రీసెంట్ గా చేసిన ప్రియమణి హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో యమ ట్రెండింగ్ మారింది. తెల్లని చీర కట్టుకొని గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకొని నగలు పెట్టుకొని తల్లో మల్లెపూలు పెట్టుకొని ఉన్న ప్రియమణి ఫొటోస్ పై నెటిజన్స్ హద్దులు మీరి కామెంట్స్ చేస్తున్నారు . ఇది ఫోటోషూట్ కోసమా మీ వారి కోసమా.. ప్రియమణి అంటూ కొందరు కామెంట్ చేయగా.. ఫోటోషూట్ తర్వాత నీకు అదే పనిగా ప్రియమణి అంటూ.. మరి కొందరు వల్గర్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ప్రియమణి లేటెస్ట్ వైట్ సారీ ట్రెండీ ఫోటోషూట్ వైరల్ గా మారింది.