ఒకప్పటి అందాల రాశి అయిన హీరోయిన్ రాశి పది ఏళ్ళ పాటు తెలుగు తెరను ఒక ఊపు ఊపెసింది. సుమారు అరవై, డబ్బైకు పైగా సినిమాలలో నటించిన రాశి స్టార్ హీరోలతో కూడా నటించింది. అప్పట్లో రాశి తన అందాలతో కుర్రకారుకు మంచి కిక్క్ ఇచ్చేది. 980 జూలై 29న రాశి చెన్నైలో జన్మించింది.ఆమె అసలు పేరు విజయ లక్ష్మీ. అయితే ఆమె సినిమాలోకి వచ్చాక తన పేరు రాశిగా మార్చుకుంది.
రాశి తల్లిది ఆంద్రప్రదేశ్ లోని పశ్చిమ గోదవరి జిల్లా భీమవరం. ఈమె తండ్రిది చెన్నై. అయితే రాశి తాత చెన్నైలో పద్మాలయ, విజయ వాహిని స్టూడియోలకు జూనియర్ ఆర్టిస్టులను సరఫరా చేసేవాడు. అలా ఆమెకు తాత నుంచే సినీ రంగంతో అనుబంధం ఏర్పడింది. అయితే రాశి తల్లిదండ్రులది ప్రేమ వివాహం. రాశి తండ్రి ముందు బాల నటుడిగా కనిపించినా తరువాత డ్యాన్సర్ గా మారాడు. రాశి కూడా తాత, తండ్రి వారసత్వాన్ని అనుసరించి చిన్నతనంలో బాల నటిగా నటించింది.
పదో తరగతి దాకా చదివిన రాశి హీరోయిన్ అయిన తర్వాత కూడా ఆంగ్ల సాహిత్యంలో బి. ఎ చేసింది. అప్పట్లో అటు స్టార్ హీరోలతో నటిస్తూ, ఇటు మీడియం రేంజ్ హీరోలు అయిన వడ్డె నవీన్, రాజేంద్ర ప్రసాద్, శ్రీకాంత్, జగపతి బాబు, రాజశేఖర్ లాంటి మీడియం రేంజ్ హీరోలకు మంచి ఆప్షన్ గా వుండేది. రాశి చాలా తక్కువ టైంలోనే చాలా వేగంగా ఎక్కువ సినిమాలు పూర్తిచేసింది. అప్పట్లో రాశి అందాల ఆరపోత అంటే వెండి తెర రచ్చ రేగిపోయేది. ఆమెను చూసేందుకే చాలా మంది ప్రేక్షకులు, యువత థియేటర్లకు వచ్చేవారు అంటే నమ్మాల్సిందే.
పది ఏళ్ళ పాటు తెలుగు తెరను ఒక ఊపు ఊపేసిన రాశి 2003 లో మహేశ్ బాబు హీరో గా వచ్చిన `నిజం`లో నటించింది. ఆ సినిమాలో లేడీ విలన్ గా నటించి… గోపిచంద్ కు జోడిగా రాశి చేసిన పాత్ర తెలుగు ప్రేక్షకులకు అస్సలు నచ్చలేదు. అప్పటి వరకు రాశిని చాలా గ్లామర్ పరంగా ఊహించుకున్న ప్రేక్షకులు అలా విలన్ పాత్రలో… అందులోనూ గోపిచంద్ పక్కన కీప్ పాత్రలో చూసి అస్సలు తట్టుకోలేక పోయారు. డైరెక్టర్ తేజ ఏమని చెప్పి రాశిని ఈ పాత్రకు ఒప్పించాడో కాని.. ఈ పాత్ర తరువాత రాశి కెరియర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఆ తరువాత ఆమెకు హీరోయిన్ గా పెద్ద అవకాశాలు రాలేదు.
అప్పటి వరకు రాశిని హీరోయిన్ గా, గ్లామర్ బొమ్మగా ఊహించుకొన్న తెలుగు ప్రేక్షకులు, దర్శక నిర్మాతలు `నిజం` సినిమాలో ఆమె క్యారెక్టర్ చూసాక మరోలా ఊహించుకోవడం మెదలు పెట్టారు. అప్పటి నుంచి ఆమెకు సరైన క్యారెక్టర్లే పడలేదు. ఆ తరువాత రాశి కెరియర్ పూర్తిగా డౌన్ అయిపోయింది. అలా `నిజం `సినిమాలో రాశితో ఆ పాత్ర చేయించి దర్శకుడు తేజ పెద్ద తప్పే చేసారు. చివరికి ఆమె కెరియర్ అక్కడితోనే చాలా వరకు క్లోజ్ అయిపోయింది.