టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న వాల్యూ గురించి పరువు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి ఓ చెరగని స్థాయిని ఏర్పరిచారు మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి హెల్ప్ లేకుండా ఎవరి సహాయం తీసుకోకుండా సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఒక చరిత్ర సృష్టించడం అంటే మామూలు విషయం కాదు. దానికి ఎంతో కృషి, పట్టుదల ,ఓపిక అన్ని ఉండాలి. అలా అన్ని కలగలసిన హీరో ఇప్పుడు మెగాస్టార్ గా సినీ ఇండస్ట్రీని ఏలేస్తున్నాడు. అయితే ఈయన పేరు చెప్పుకొని ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోలు వచ్చిన ఈయన పేరు ఉపయోగించుకొని ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చిన వారిలో మాత్రం కొంతమంది సక్సెస్ అయ్యారు.
కాగా మెగాస్టార్ ఫ్యామిలీలో ఆయన చిన్న కూతురు సృష్టిస్తున్న రగడ అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ మూడో పెళ్లికి సిద్ధమైందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మొదట శ్రీజ తాను ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చింది . ఆ తర్వాత అతనితో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకొని మళ్లీ తండ్రి వద్దకు వచ్చి చేరింది . ఇక ఆ తరువాత చిరంజీవి ఆమెకు మంచి సంబంధం అంటూ కళ్యాణ్ దేవ్ ను ఇచ్చి పెళ్లి చేశాడు .
కొన్నాళ్ళు బాగానే సాగిన వీరి కాపురం ఓ బిడ్డ పూట్టే వరకు వచ్చింది. అయితే సగంలో ఏమైందో ఏమో తెలియదు గానీ మళ్లీ వీళ్ళు విడాకులు తీసుకున్నారు అంటూ ప్రచారం మొదలైంది .అంతేకాదు శ్రీజ కు విడాకులు ఇచ్చిన కళ్యాణ్ దేవ్ రెండో పెళ్లి కూడా చేసుకోబోతున్నాడట తన మరదల్ని పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతుంది. కాగా రీసెంట్ గా శ్రీజ మళ్లీ ఓ పెద్ద తప్పు చేస్తున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
శ్రీజ కొణిదెల తన పెద్ద కూతురు నివృత్తిని సినిమాలోకి సినిమా రంగంలోకి దించబోతుందట. నిజానికి మెగాస్టార్ ఫ్యామిలీ నుండి హీరోలు వచ్చినా అభిమానుల ఆదరిస్తారు ..కానీ, హీరోయిన్లుగా ఆడవాళ్లు వస్తే సహించరు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీ ఎంత మురికి కుంటో అందరికీ తెలిసిందే. అలాంటి మెగాస్టార్ ఫ్యామిలీ నుండి ఆడపిల్ల సినీ ఇండస్ట్రీలోకి వస్తుందంటే ఒప్పుకోరు. అది కూడా తెరపై కనిపిస్తుంది అంటే అసలకి ఒప్పుకోరు. ఇదే విషయంలో నీహారిక పెద్ద తప్పే చేసింది. అయితే ఇప్పుడు అదే తప్పును శ్రీజ కూడా చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తన పెద్ద కూతురు నివృత్తిని రామ్ చరణ్ సినిమాలో స్పెషల్ రోల్ లో సినీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేస్తుందట . దీని గురించి ఇప్పటికే చిరంజీవిని సంప్రదించగా ఆయన నో చెప్పినా కానీ శ్రీజ మొండి పట్టుదలగా నివృతిని ఇండస్ట్రీలోకి దించడానికి రంగం సిద్ధం చేసినట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందుతుంది. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రమే శ్రీజకు సపోర్ట్ చేస్తున్నారని మిగత వాళ్లు సపోర్ట్ చేయట్లేదని ఓ న్యూస్ సినీ వర్గాలలో హల్చల్ చేస్తుంది మరి చూడాలి. దీనిపై శ్రీజ లేదా మెగా ఫ్యామిలీ ఎలా స్పందిస్తారో..?