Movies"ఆ టైంలో విపరీతమైన నొప్పి వచ్చేది..కానీ భరించా"..కన్నీరు తెప్పిస్తున్న కాజల్ మాటలు...

“ఆ టైంలో విపరీతమైన నొప్పి వచ్చేది..కానీ భరించా”..కన్నీరు తెప్పిస్తున్న కాజల్ మాటలు ..!!

కాజల్ అగర్వాల్ ..టాలీవుడ్ చందమామ. చూడటానికి చాలా క్యూట్ గా.. చాలా అందంగా.. అచ్చం తెలుగింటి అమ్మాయి లాగే ఉంటుంది . అఫ్ కోర్స్.. తెలుగు అమ్మాయి కాకపోయినా కానీ కాజల్ చీర కడితే మన తెలుగు అమ్మాయి అని అనక తప్పదు. అలా ఉంటుంది ఈ కాజల్. ఎవరైనా సడన్ గా ఈ అమ్మడుని చూస్తే ఆమె తెలుగు ఆమెనా.. తెలుగు అమ్మాయే కదా అని అనిపించే అంత చక్కగా సహజ సిద్ధమైన నటనతో అభిమానులను ఫిదా చేస్తుంది. నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన లక్ష్మి కళ్యాణం సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంటర్ అయిన కాజల్ అగర్వాల్ ..ఆ తర్వాత రెండో సినిమాకి బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.’

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన మగధీర సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఆమె కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ వేసుకుంది. ఈ సినిమాలో దర్శకధీరుడు రాజమౌళి కూడా చూసి మైమరిచిపోయాడు. అంతలా కాజల్ తన నటనతో అభిమానులను మెప్పించింది. అది మిత్రవింద గా అయినా మోడ్రన్ ఇందుగా అయినా.. రెండు పాత్రలలోను వేరియేషన్స్ చూపించి శభాష్ అనిపించుకుంది. ఇక ఆ తర్వాత కాజల్ వెనక్కి తిరిగి చూసుకునే పని లేకుండా పోయింది.

ఈ మధ్యనే తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ కిచ్లు ని పెళ్లి చేసుకున్న కాజల్ అగర్వాల్ ..అంతే త్వరగా ఓ బిడ్డకు జన్మనిచ్చి అమ్మ అనిపించుకుంది. అయితే రీసెంట్ గా కాజల్ అగర్వాల్ ఫ్రీడం టు ఫీడ్ అనే కార్యక్రమంలో పాల్గొంది. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ..” నీల్ పుట్టిన తర్వాత నా వర్క్ లైఫ్ పర్సనల్ లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోయాను . చాలా కష్టంగా అనిపించింది. మరీ ముఖ్యంగా తనని వదిలి షూటింగ్స్ కు బయటకు వెళ్లాల్సినప్పుడు నా ప్రాణం పోయినంత పని అయింది. కానీ తప్పలేదు నేను కంప్లీట్ చేయాల్సిన పనుల కోసం బయటికి వెళ్లాల్సి వచ్చింది. ఆ టైంలో నీల్ ని ఇంటి దగ్గర వదిలి నేను వెళ్తుంటే నాకు చాలా బాధేసింది . బయటికి వెళ్లిన ప్రతిసారి నీళ్లు గురించి ఆలోచించే దాన్ని తనకి తగిన సమయం ఇవ్వలేకపోతున్నానా అని బాధపడేదాన్ని. నిజం చెప్పాలంటే తన కోసమే నేను జిమ్ కి వెళ్లడం కూడా మానేశాను.

అంతేకాదు ప్రతి బిడ్డకు అమ్మ పాలు పట్టాలని అనుకుంటుంది. ఆ ఫీలింగ్ చాలా అద్భుతమైనది. అఫ్ కోర్స్ పిల్లలు పాలు తాగేటప్పుడు అమ్మకి నొప్పి వస్తుంది. నాకు కూడా నీల్ పాలు తాగేటప్పుడు చాలా నొప్పి అనిపించేది. కానీ ఆ నొప్పి కూడా నేను ప్రేమగా భరించాను. ఆ ఫీలింగ్ ని నేను ఎప్పటికీ మర్చిపోలేను .చిన్నారి అవసరాలకు అనుగుణంగా మనం ముందుకెళ్లాలి. మన వర్క్ ని బిడ్డలని రెండిటిని మేనేజ్ చేయాలి అది మనం మానసికంగా సిద్ధపడితే మాత్రమే సాధ్యమవుతుంది “అంటూ కాజల్ అగర్వాల్ తెలిపారు . ఈ క్రమంలోని కాజల్ మాట్లాడిన మాటలు ప్రతి తల్లికి కనెక్ట్ అవుతున్నాయి. ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు వర్కింగ్ ఉమెన్స్.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news