Moviesబుస్సుమనే అనసూయ..బ్రహ్మాజీ విషయంలో సైలెంట్ గా ఉండటానికి కారణం అదేనా..!?

బుస్సుమనే అనసూయ..బ్రహ్మాజీ విషయంలో సైలెంట్ గా ఉండటానికి కారణం అదేనా..!?

అనసూయ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఆంటీ అంటూ హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి కారణం రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ అన్న సంగతి తెలిసిందే. లైజర్ సినిమా రోజు అనసూయ పరోక్షకంగా విజయ్ దేవరకొండని విమర్శిస్తూ ట్విట్ చేయడం హాట్ టాపిక్ గా మారిపోయింది. విజయ్ అభిమానులు ఆమెను ఆంటీ ఆంటీ ఆంటీ అంటూ ట్రోల్ చేయడం గత కొన్ని రోజులుగా చూస్తూనే ఉన్నాం . ఈ క్రమంలోనే అనసూయ కూడా ట్రోలర్స్ కి అలా బూతు మాటలు మాట్లాడేవాళ్ళకి గట్టిగా కౌంటర్ ఇస్తూనే వచ్చింది . అంతేకాదు ఏకంగా తనను ఆంటీ అంటూ ట్రోల్ చేసే వాళ్లపై పోలీస్ కంప్లైంట్ ఫైల్ చేసింది.

కాగా అనసూయకి పరోక్షంగా కౌంటర్ ఇస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కమెడియన్ నటుడు బ్రహ్మాజీ మరో సరికొత్త వివాదానికి తెరలేపాడు. ఆయనను ఓ నెటిజన్ అంకుల్ అన్నాడు. “బ్రహ్మాజీ కోప్పడుతూ అంకుల్ ఏంట్రా అంకుల్ బాడీ షేమింగా కేసు వేస్తా జాగ్రత్త “అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో అందరూ ఇది అనసూయకి కౌంటర్ అంటూ పెద్ద ఇష్యూ గా మార్చేశారు. అయితే చిన్న మాట అంటేనే తట్టుకోలేని అనసూయ.. బ్రహ్మాజీ అంత పెద్ద కామెంట్స్ చేసినా.. కానీ, సైలెంట్ గా ఉండడానికి కారణం ఏంటా..?? అంటూ సోషల్ మీడియాలో జనాలు చర్చించుకుంటున్నారు.

గతంలో ఓ రిపోర్టర్ తన ఏజ్ ఎక్కువ రాసిందని క్లారిటీ ఇస్తూ అనసూయ ఆ ఆర్టికల్ ని ట్యాగ్ చేస్తూ పెద్ద క్లాసే పీకింది. మరి అలాంటి అనసూయ కి బ్రహ్మాజీ కామెంట్స్ కనిపించట్లేదా అంటూ కొందరు ప్రశ్నిస్తుంటే ..మరికొందరు అనసూయ కి బ్రహ్మాజీకి అదోరకమైన ఫ్రెండ్షిప్ ఉందిలే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో అనసూయ బ్రహ్మాజీ మధ్య ఏ రిలేషన్ ఉందా అంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . మరి చూడాలి ఈ అనసూయ ఆంటీ ..బ్రహ్మాజీ అంకుల్ వివాదం ఎంతవరకు వెళ్తుందో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news