యాంకర్ సుమ ఈ పేరుకు కొత్త పరిచయాలు అవసరం లేదు. దశాబ్ద కాలంగా బుల్లితెరను ఏలేస్తున్న యాంకరమ్మ అని చెప్పాలి. సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది యాంకర్లు వస్తుంటారు పోతుంటారు. కానీ వాళ్ళల్లో అందరికీ గుర్తుండిపోయే పేరు మాత్రం సుమ. కాదు కాదు కాదు యాంకర్ సుమ. ఇలా పిలిస్తేనే ఆ పేరుకు అర్థం ఉంటుంది. అప్పుడే జనాలకు ఆ కిక్ అనేది ఎక్కుతుంది. సుమ ఎక్కడ ఉంటే అక్కడ పంచ్ ల వర్షం ..నవ్వులే ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాలా.. నో వల్గారిటి..నో హట్టింగ్.. నో ఎక్స్పోజింగ్ ఈ మూడింటిని బేస్ చేసుకుని సుమ తన యాంకరింగ్ చేస్తూ ఉంటుంది.
క్షణం తీరిక లేకుండా ఓ పక్క ఆడియో ఫంక్షన్లు ఓ పక్క బుల్లితెర ఈవెంట్స్ ఇలా కెరియర్ ని బిజీగా మలుచుకున్న సుమ ఎప్పుడు సరదాగా నవ్వుతూ నవ్విస్తూనే ఉంటుంది. సుమ కన్నీరు పెట్టుకున్న సందర్భాలు చాలా తక్కువ. అందరూ అనుకుంటారు ఈమెకి కష్టాలు లేవా..? ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది.. అని కానీ, అది తప్పు సుమ కూడా రోజు ఇంటికి వెళ్లి బాధపడుతుందట. కన్నీరు పెట్టుకుంటుందట ఎందుకో తెలుసా..?
తన అత్తగారు, రాజీవ్ కనకాల అమ్మగారు ఆమె పక్కన లేకపోవడం . నిజానికి ఈ రోజుల్లో అత్తా కోడలు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతిదానికి విసిగించుకునే అత్తగారు కోప్పడిపోయే కోడలు పిల్ల ఇలానే ఉన్నారు ప్రస్తుతం జనరేషన్. కానీ సుమకి వాళ్ళ అత్తగారు అంటే చాలా ఇష్టం. తన అమ్మ తర్వాత అమ్మలాగ భావించిన అమ్మగారు లేకపోవడంతో సుమ ఇప్పటికి బాధపడుతూనే ఉంటుందట.
తాను ఎన్ని ఫంక్షన్ ఎన్ని షో స్ చేసినా ఏ ఈవెంట్స్ కి వెళ్ళినా.. తన పిల్లల్ని దగ్గరుండి తనకన్నా బాగా చూసుకునేది . కానీ ప్రజెంట్ ఇప్పుడు ఆ పొజిషన్ లేదని ప్రతిరోజు ఇంటికి వెళ్ళగానే ఆమె ఫోటో చూసుకొని బాధపడుతూ ఉంటానని సుమ తన స్నేహితురాలికి చెప్పుకోరావడం.. ఆ విషయం సోషల్ మీడియాలో లీక్ అవడం ..ఇప్పుడు సుమ అభిమానులను కన్నీరు పెట్టుకునేలా చేస్తుంది.