ఒకప్పుడు చియాన్ విక్రమ్ సినిమాలకు సౌత్ ఇండియా అంతటా క్రేజ్ ఉండేది. ఇప్పుడు మన హీరోలు పాన్ ఇండియా అంటూ ఎగురుతున్నారే కాని.. ఒకప్పుడు విక్రమ్ సినిమాలు తమిళం, తెలుగు, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కూడా సూపర్ హిట్ అయ్యేవి. అయితే గత కొంత కాలంగా విక్రమ్‌కు కాలం కలిసి రావడం లేదు. సినిమాలు వరుస ప్లాపులు అవుతున్నాయి. దీంతో ఒకప్పుడు తెలుగులో ఇక్కడ స్టార్ హీరోలతో సమానమైన మార్కెట్ ఉన్న విక్రమ్ ఇప్పుడు బాగా డల్ అయిపోయాడు.
ఈ క్రమంలోనే విక్రమ్ తాజా చిత్రం కోబ్రా రేపు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఎప్పటి నుంచో వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ సినిమాను రేపు తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో కోబ్రాపై మరీ అంత భారీ అంచనాలు అయితే లేవు. అయితే సినిమా ట్రైలర్ కొత్తగా ఉండడంతో పాటు ప్రామీసింగ్‌గా ఉంది. ఆర్ అజయ్ జ్ఞానముత్తు ఈ సినిమాకు దర్శకుడు.
ఈ సినిమాలో విక్రమ్ 9 – 10 గెటప్పుల్లో కనిపించనున్నాడు. ఇక ఈ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. ప్రముఖ దుబాయ్ క్రిటిక్ మెంబర్, సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు ఈ సినిమాను చూసి తన ఫస్ట్ రివ్యూను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విక్రమ్ నుంచి ప్రేక్షకులు, ఆయన అభిమానులు ఎలాంటి అంశాలు కోరుకుంటారో అవన్నీ ఈ సినిమాలో ఉన్నాయని చెప్పారు.
యాక్షన్ సీన్లు, ఇతర సన్నివేశాలు ఈ సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయని ఉమైర్ చెప్పాడు. విక్రమ్ గెటప్పులు కూడా అదిరిపోతాయట. యాక్షన్ సీన్లు అయితే విజువల్ ఫీస్ట్‌గా మైండ్ బ్లోయింగ్ అనే రేంజ్‌లో తెరకెక్కించారట. కేజీయఫ్ హీరోయిన్ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా కోసం ఆమె అభిమానులు కూడా ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు.
యూనిక్ కాన్సెఫ్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమాలో డైరెక్షన్ టెర్రిఫిక్‌గా ఉందని ఉమైర్ చెప్పాడు. ప్రొడక్షన్ డిజైన్, క్లైమాక్స్ అద్భుతం అని.. నా రేటింగ్ 3.5 అని చెప్పాడు. ఉమైర్ రివ్యూ వల్ల కోబ్రాపై అంచనాలు భారీగానే ఉన్నా.. ఇటీవల అతడు డిజాస్టర్ సినిమాలు కూడా సూపర్ అని చెప్పడంతో కొంత సందేహాలు కూడా ఉన్నాయి.