సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రతి ఒక్కరూ తమ డౌట్లను ..తమకు తెలియని విషయాలను నిర్మొహమాటంగా అడిగేస్తున్నారు. కాగా ఇప్పుడు యంగ్ బ్యూటీ పెట్టిన ట్విట్ చర్చనీయాంసంగా మారింది. అసలే ఈమె మీద పీకల వరకు కోపంగా ఉండే జనాభా ఇప్పుడు ఆమెపై మరింత రెచ్చిపోయి ట్రోల్ల్ చేస్తున్నారు. పూనమ్ కౌర్ ఈ పేరు కి కొత్త పరిచయాలు అవసరం లేదు. సినిమాలో హీరోయిన్ గా , సైడ్ క్యారెక్టర్ గా చేసింది చాలా తక్కువ సినిమాలు. కానీ అమ్మడు పేరు తెలియని వారంటూ ఉండరు.
టాలీవుడ్ స్టార్ హీరో తో ప్రేమాయణం నడిపిందంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. అంతేనా ఆ హీరో కారణంగా కడుపు తెచ్చుకుందని.. తీరా హీరో హ్యాండ్ ఇవ్వడంతో అబార్షన్ కూడా చేయించుకుందంటూ ఓ రేంజ్ లో అమ్మడు పై ఫైర్ అయ్యారు నెటిజన్స్ . ఇప్పటికీ ఆ మ్యాటర్ చాలా సంచలనంగా ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఇవి చాలావు అన్నట్లు పూనమ్ ప్రతి కాంట్రవర్షీయల్ మ్యాటర్లో వేలు పడుతూనే ఉంటుంది. తనకి సంబంధం ఉన్న లేకపోయినా ఖచ్చితంగా కాంట్రవర్షియల్ మ్యాటర్స్ లో తలదూర్చి తిట్టించుకుంటూనే ఉంటుంది ఈ బ్యూటీ.
ప్రస్తుతం సినిమాలు లేక చేతిలో ప్రాజెక్ట్ లేక ఖాళీగా సోషల్ మీడియాలో కాలం గడుపుతున్న ఈ బ్యూటీ తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. పూనమ్ కౌర్ ట్వీట్ చేస్తూ..” జీసస్ ఎవరికి పుట్టారు ..?ఆయన అసలు ఎలా పుట్టారు..? ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ నాకు చెప్పండి. నేను పెద్దగా చదువుకోలేదు. ఇలాంటి విషయాలు నాకు అసలు తెలియదు. అందుకే అడుగుతున్నా” అంటూ ట్వీట్ చేసింది. దీనిపై క్రైస్తవులు ఫైర్ అవుతున్నారు. తమ ఆరాధ్య దైవమైన జీసస్ ని ఇలా అంటుందా అంటూ మండిపడుతున్నారు . సాధారణంగా జీసస్ గురించి ఇలాంటి ప్రశ్నలు అడిగితేనే క్రైస్తవులు తీవ్ర వ్యతిరేక చూపిస్తారు. అలాంటిది ఈమె ఏకంగా సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పోస్ట్ పెట్టడం ఇప్పుడు సంచలనంగా మారింది. దీనిపై అమ్మడును క్రైస్తవులు ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. బూతులు తిడుతున్నారు.
I am sorry I am asking this because I m unaware and also I am a illiterate – please let me know without getting offended –
How is jesus born ? Who is he born to ?
— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) August 27, 2022